Eye Problem Solving with Gene Therapy: జన్యు చికిత్సతో కంటి సమస్యకు పరిష్కారం.. ఎల్‌వీ ప్రసాద్ కంటి అధ్యయన సంస్థ ఘనత
వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను గుర్తించేందుకు రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలియం(ఆర్‌పీఈ) ఉత్పరివర్తనాలు సహకరిస్తాయని ఎల్‌వీ ప్రసాద్ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది.
Newdelhi, Apr 29: వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను (Eye Problems) గుర్తించేందుకు రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలియం(ఆర్‌పీఈ-RPE) ఉత్పరివర్తనాలు సహకరిస్తాయని ఎల్‌వీ ప్రసాద్ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది. వారసత్వంగా కంటి సమస్యలున్న 260 మంది జన్యువులతో సీక్వెన్సింగ్ చేయడం వలన రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలీయం లోపాలను గుర్తించినట్లుగా తేల్చారు. చిన్న వయసులోనే ఈ లోపాలను గుర్తిస్తే సవరించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.