Miracle in Sky: నేడు నింగిలో అరుదైన పరిణామం.. భూమికి చేరువగా రానున్న గురు గ్రహం.. 59 ఏళ్ల తర్వాత పునరావృతం.. మళ్లీ 107 ఏళ్ల తర్వాతే

నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది.

Jupitar (File)

NewDelhi, September 26: నేటి రాత్రి ఆకాశంలో అరుదైన పరిణామం చోటు చేసుకోనుంది. గురు గ్రహం భూమికి అత్యంత సమీపానికి రానుంది. శనీశ్వరుడు, గురువు, భూమి మూడు ఒకే రేఖ లో కనిపించనున్నారు. గురు గ్రహం భూమికి అత్యంత చేరువగా రావడం 59 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిగా 1963లో ఇది సాధ్యమైంది. మళ్లీ ఈ దృశ్యాన్ని చూడాలంటే ఎన్నో తరాలు ఆగాల్సిందే. 107 ఏళ్ల తర్వాత 2129లో మళ్లీ గురువు భూమికి చేరువగా వస్తుంది. అంటే ప్రస్తుతం భూమిపై ఉన్న ఏ ఒక్కరికీ మళ్లీ ఇలాంటి దృశ్యాన్ని చూసే భాగ్యం ఉండదు. భూమికి సమీపానికి వచ్చినప్పుడు.. భూమి నుంచి గురు గ్రహం మధ్య దూరం 59,06,29,248 (59.06 కోట్లు) కిలోమీటర్లు ఉంటుంది.

వర్క్ ఫ్రం హోం ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ.. బరువు తగ్గితే రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించిన ‘జెరోధా’

భూమికి దూరంగా వెళ్లినప్పుడు 96,56,06,400 (96.56కోట్లు) కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది. సౌర వ్యవస్థలో అతిపెద్దదైన గురు గ్రహం భూమికి సమీపానికి వచ్చినప్పుడు.. ఇంకా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. ప్రతి 399 రోజులకు ఒకసారి (13 నెలల నాలుగు రోజులు) జూపిటర్ భూమికి వ్యతిరేక దిశలోకి వస్తుంది. అప్పుడు ఆకాశంలో గురుగ్రహం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది. ఇది మంగళవారం ఆవిష్కృతం కానుంది. సోమవారం సాయంత్రం మాత్రం భూమికి సమీపానికి రానుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Banana Still Fresh After Opening: తొక్క తీసినా 24 గంటలపాటు తాజాగానే అరటిపండు.. అదెలా అంటారా? అయితే, ఈ వార్త చదవండి..!

Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్‌ తల్లి డ్యాన్స్‌.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి

Nilam Shinde Accident News: అమెరికాలో రోడ్డు ప్రమాదం, కోమాలోకి వెళ్ళిపోయిన భారత విద్యార్థిని, అత్యవసర వీసా కోసం తల్లిదండ్రులు కేంద్రానికి విజ్ఞప్తి

50 Members Hospitalized in Narayanakhed: బావి నీళ్లు తాగి 50 మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌, ఇద్ద‌రు మృతి, ప‌లువురి ప‌రిస్థితి విష‌మం, మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రాక‌పోవ‌డంతో బావిలో నీరు తాగిన గ్రామ‌స్తులు, సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ లో ఘ‌ట‌న‌

Advertisement
Share Now
Advertisement