banana

Newdelhi, Mar 4: తొక్క తీసిన అరటిపండు (Banana) ఐదు నిమిషాల్లోనే చెడిపోతుంది. జావగారిపోయి దుర్వాసన కూడా వస్తుంది. కొద్ది క్షణాల్లోనే నల్లబడుతుంది. అయితే, తొక్క తీసిన తర్వాత కూడా అరటిపండు 24 గంటలపాటు తాజాగా (Fresh) ఉండేట్టు చేయటంలో బ్రిటిష్‌ సైంటిస్టులు సక్సెస్‌ అయ్యారు. జన్యుపరమైన మార్పులు చేయటం ద్వారా కొత్త రకం అరటిపండును ఆవిష్కరించినట్టు వారు పేర్కొన్నారు. సాధారణ అరటిపండుతో పోల్చితే, జన్యు మార్పులు చేసిన అరటిపండు రుచి, కమ్మదనం, రంగులో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. తోలు తీసిన అరటిపండు లేదా ముక్కలుగా కోసిన తర్వాత కూడా దాని రుచి, రంగు, రూపం 24 గంటలపాటు అలాగే కొనసాగుతుందని చెప్పారు.

వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

ఆరోగ్యానికి మంచే

సాధారణంగా అరటిపండు తొక్క తీసిన తర్వాత వెంటనే మగ్గిపోతుంది. దానిని ఎక్కువ సమయం నిల్వ చేయలేం. సైంటిస్టులు కనుగొన్న కొత్త రకం అరటిపండ్ల అమ్మకాలు ఇదే నెలలో అమెరికా, కెనడా, ఫిలిప్పీన్స్‌, కొలంబియా దేశాల్లో మొదలవుతాయి. దీంతో అరటి ఎగుమతులు, రెడీ టూ ఈట్ ఫుడ్స్ కు డిమాండ్ పెరుగొచ్చని అంటున్నారు. పైగా ఆరోగ్య పరంగా ఈ అరటి పండ్లు  శరీరానికి మంచికూడా చేస్తుందని పేర్కొన్నారు.

రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)