Diabetes with Late Sleep: రాత్రిళ్లు మేల్కొనే ఉంటారా? లేటుగా నిద్ర పోతారా?? అయితే డయాబెటిస్‌ బారినపడ్డట్టే.. తాజా అధ్యయనంలో వెల్లడి

మారిన జీవనశైలి కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఊహించని విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చిపడుతున్నాయి.

Late sleep (Credits: X)

Newdelhi, Sep 10: మారిన జీవనశైలి (Lifestyle) కారణంగా రాత్రిళ్లు నిద్రపోయే సమయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఊహించని విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చిపడుతున్నాయి. రాత్రి సమయంలో త్వరగా పడుకొని.. పొద్దునే లేచే వ్యక్తులతో పోల్చితే, రాత్రంతా మేల్కొనేవాళ్లు టైప్‌-2 డయాబెటిస్‌ (Diabetes) బారినపడే ముప్పు 46 శాతం ఎక్కువ. ఈ మేరకు నెదర్లాండ్స్‌ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. డయాబెటిస్‌ రావడానికి జీవన శైలి ఒక్కటే కారణం కాదని, అధిక బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌), పెద్ద పొట్ట, శరీరంలో అధిక కొవ్వులు.. ఇవన్నీ టైప్‌-2 డయాబెటిస్‌ ను కలుగజేయడంలో 50శాతం పాత్ర వహిస్తాయని తేల్చారు.

భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు, జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని తెలిపిన కేంద్రం

ఎందుకు ఇలా..?

మూడు రకాలైన నిద్ర సమయాల్ని కలిగిన 5 వేల మందిపై సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. నిద్రపోతున్న తీరుతో మన శరీరంలో జీవ గడియారం ప్రభావితం కాగానే, అది జీవ క్రియల్ని ఆటంక పరుస్తున్నదని, ఇది టైప్‌-2 డయాబెటిస్‌కు దారితీస్తున్నదని చెప్పారు.

భారత్‌లో మంకీపాక్స్‌ కేసు, వైరస్‌ కట్టడిపై అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement