IPL Auction 2025 Live

WhatsApp: భారీ మొత్తంలో వాట్సాప్ అకౌంట్లపై నిషేదం, జస్ట్ నవంబర్ నెలలోనే భారత్‌లో 37లక్షలకు పైగా అకౌంట్లను నిషేదించిన వాట్సాప్, ఎందుకు ఇలా చేసిందో తెలుసా?

వాట్సాప్ నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య 37 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది. అక్టోబర్‌లో నిషేధించిన అకౌంట్ల కన్నా రెండు లక్షలు ఎక్కువగానే ఉన్నాయి. 37 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లలో 990,000 యూజర్ల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్టు నివేదిక పేర్కొంది.

WhatsaApp (Photo Credits: Pxfuel)

New Delhi, DEC 22: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (WhatsApp) నవంబర్ నెలలో లక్షలాది అకౌంట్లను (banned) నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(D) ప్రకారం.. వాట్సాప్ నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య 37 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది. అక్టోబర్‌లో నిషేధించిన అకౌంట్ల కన్నా రెండు లక్షలు ఎక్కువగానే ఉన్నాయి. 37 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లలో 990,000 యూజర్ల నుంచి ఎలాంటి నివేదికలు రాకముందే ముందస్తుగా బ్యాన్ చేసినట్టు నివేదిక పేర్కొంది. భారతీయ లక్షలాది వాట్సాప్ అకౌంట్లను నిషేధించడంపై WhatsApp ప్రతినిధి మాట్లాడుతూ.. వాట్సాప్ దుర్వినియోగాన్ని నిరోధించడంలో అగ్రగామిగా నిలిచింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసుల్లో ఏళ్ల తరబడిగా నిలిచిన వాట్సాప్ యూజర్లను సేఫ్‌గా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డేటా సైంటిస్టులు, నిపుణులు, ప్రక్రియలలో స్థిరంగా పెట్టుబడి పెట్టినట్టు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ తెలిపింది.

Elon Musk: ట్విటర్ సీఈవోగా తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా! ట్విటర్ పోల్‌పై స్పందించిన ఎలాన్ మస్క్, కానీ ఒక్క కండీషన్ అంటూ మెలిక 

WhatsApp గుర్తింపు అకౌంట్ మూడు దశల్లో పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ సమయంలో మెసేజ్ పంపే నెగటివ్ అభిప్రాయానికి వినియోగదారు నివేదికలు, బ్లాక్‌ల రూపంలో పొందవచ్చు. ఎడ్జ్ కేసులను అంచనా వేసేందుకు కాలక్రమేణా ప్రభావాన్ని తగ్గించడంలో సాయపడేందుకు విశ్లేషకుల బృందం ఈ వ్యవస్థలను పటిష్టం చేస్తుందని కంపెనీ తెలిపింది.వాట్సాప్ కంపెనీ విధానాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించే అకౌంట్లను నిషేధిస్తామని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉదాహరణకు.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ధృవీకరించని మెసేజ్‌ను మల్టీ కాంటాక్ట్‌లకు ఫార్వార్డ్ చేయడం, మరిన్నింటికి సంబంధించిన అకౌంట్లను WhatsApp నిషేధించవచ్చు.

YouTube: యూట్యూబ్ నుంచి భారతదేశానికి రూ. 10,000 కోట్లకు పైగా జీడిపి రూపంలో ఆదాయం, 750,000 ఉద్యోగాలకు సమానంగా మద్ధతు ఇచ్చామని తెలిపిన గూగుల్  

గత కొన్ని ఏళ్లుగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఓపెన్ లింక్‌లను ధృవీకరించడం, ఫార్వార్డ్ మెసేజ్‌లను పరిమితం చేయడం, మరిన్నింటితో సహా అలాంటి సందర్భాలను ఎదుర్కోవడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అనేక సార్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లను కూడా సూచిస్తుంది. చాలా సందర్భాలలో ఫేక్ మెసేజ్ అని తేలింది. ఇలాంటి వాట్సాప్ అకౌంట్లను WhatsApp నిషేధించే అవకాశం ఉంది. 2022లో వాట్సాప్ భారత్, గ్లోబల్ మార్కెట్‌లోని యూజర్ల కోసం అనేక ప్రైవసీ సంబంధిత ఫీచర్‌లను ప్రారంభించింది. వీటిలో కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేయడం, గ్రూప్‌లలో అడ్మిన్ కంట్రోల్, గ్రూప్‌లను మ్యూట్ చేయడం, అత్యుత్తమ ఫీచర్‌లలో ఒకటిగా ఉంది. చాలా మంది ఎదురుచూసే ఫీచర్‌లలో ఒకటి.. హైడ్ ఆన్‌లైన్ స్టేటస్ (Hide Online Status). వాట్సాప్ వినియోగదారులు తమ ఆన్‌లైన్ స్టేటస్ పూర్తిగా హైడ్ చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే iOS, Android యూజర్లకు అందుబాటులో ఉంది.