Sri Lanka Bus Accident: భయానక వీడియో..లోయలో పడిన బస్సు, 14 మంది అక్కడికక్కడే దుర్మరణం, 30 మందికి తీవ్ర గాయాలు, శ్రీలంకలో పసరా పట్టణానికి సమీపంలో విషాద ఘటన

శ్రీలంకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో (Sri Lanka Bus Crash) పడింది. దీంతో 13 మంది దుర్మరణం పాలవగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం (Bus crash kills 14 in Sri Lanka) సంభవించింది. శ్రీలంకలోని పసరా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రిసిపైస్‌ గ్రామంలో విషాదం అలుముకుంది.

Srilanka bus crash (Photo-Twiter/Abishek)

Colombo, Mar 20: శ్రీలంకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో (Sri Lanka Bus Crash) పడింది. దీంతో 14 మంది దుర్మరణం పాలవగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం (Bus crash kills 14 in Sri Lanka) సంభవించింది. శ్రీలంకలోని పసరా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రిసిపైస్‌ గ్రామంలో విషాదం అలుముకుంది.

70 మంది ప్రయాణికులతో శనివారం బస్సు బయల్దేరింది. అయితే కొండ ప్రాంతమైన మొనెరగులా-బదుల్లా రోడ్డు మార్గం చాలా ప్రమాదకరం. ఈ ఇరుకు మార్గంలో ఒకేసారి బస్సు, ట్రక్కు వచ్చాయి. ఈ సమయంలో ట్రక్కును తప్పించబోయి మలుపు ప్రాంతంలో బస్సు కొంచెం పక్కకు జరగడంతో పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 1 4మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

సమాచారం అందించిన వెంటనే అధికారులు, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Here's Video 

వారిలో కొద్దిమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని పోలీస్‌ అధికారి అజిత్‌ రోహన తెలిపారు. ఈ రోడ్డు వెంట తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. 16 ఏళ్లల్లో ఇదే అతి పెద్ద ప్రమాదమని అధికారులు గుర్తించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement