Bangladesh Ferry Fire: నౌకలో మంటలు చెలరేగి 32 మంది సజీవ దహనం, బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం, ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలో దూకిన ప్రయాణికులు

బంగ్లాదేశ్‌(Bangladesh )లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నౌక(Ferry)లో మంటల చెలరేగి 32 మంది ప్రయాణికులు మరణించారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.

Bangladesh December 24: బంగ్లాదేశ్‌(Bangladesh )లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నౌక(Ferry)లో మంటల చెలరేగి 32 మంది ప్రయాణికులు మరణించారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.

ఝలోకరి(Jhalokathi) ప్రాంతంలోని సుగంధ నది(Sugandha River)లో ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న ఓ మూడంతస్తుల నౌక(Ferry)లో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటల వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. దీంతో కొందరు ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ...నీటిలో మునిగి మరికొందరు మరణించారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Myanmar Landslide Tragedy: ఘోర విషాదం.. మయన్మార్‌లో విరిగిపడిన కొండచరియలు, శిధిలాల కింద చిక్కుకున్న 70 మంది, ఒకరు మృతి, కచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ గని వద్ద ఘటన

మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ...ఈ నౌకలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement