Russia Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్‌ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రష్యా బీభత్సం, రైల్వే స్టేషన్‌పై బాంబుల వర్షం, 22 మందికి పైగా మృతి, భద్రతా మండలికి ఫిర్యాదు చేసిన జెలెన్‌ స్కీ

ఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవం (Ukraine Independence Day) రోజున డ్నిప్రోపెట్రోవ్‌స్కీ (Dnipropetrovsk) ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్‌తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది వరకు మరణించి ఉండొచ్చని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపారు.

Ukraine-President-Volodymyr-Zelensky

Kyiv, AUG 25: ఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవం (Ukraine Independence Day) రోజున డ్నిప్రోపెట్రోవ్‌స్కీ (Dnipropetrovsk) ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్‌తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది వరకు మరణించి ఉండొచ్చని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపారు. దాడిలో గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన ఐరాస భద్రతా మండలిలో (UN Security Council) మాట్లాడారు. ఈ రష్యా ఈ వారం అనాగరిక చర్యలకు ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లో దాడి జరగ్గా.. ఘటనలో చాలా మంది గాయపడ్డారు. డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని చాపెల్నే నగరంలో ఈ ఘోరమైన దాడి జరిగిందంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోను ఐరాస భద్రతా మండలికి జెలెన్‌స్కీ తెలిపినట్లు ఉక్రెయిన్‌ వార్త సంస్థలు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రుచిరా కాంబోజ్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో భారత్‌ 12వ మానవతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మందులతో పాటు తీవ్ర గాయాలకు బ్యాండెజీలతో పాటు 24 రకాలు పంపనున్నట్లు తెలిపారు.

Ban on Imran Khan Speechs: ఇమ్రాన్‌పై నిషేదం విధించిన టీవీ ఛానెళ్లు, ఇకపై ఇమ్రాన్ మాట్లాడితే లైవ్ ఇవ్వకూడదని మూకుమ్మడి నిర్ణయం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నిషేదిస్తున్నట్లు ప్రకటన, ఇంతకీ ఇమ్రాన్ ఏమన్నాడో తెలుసా?  

రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం యూరప్‌కే పరిమితం కాదని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతపై ఆందోళనలు పెంచుతోందని రుచిరా పేర్కొన్నారు. గోధుమలు, చెక్కెర సరఫరా కోసం అనేక దేశాలు భారత్‌ను సంప్రదించాయని, తాము సానుకూలంగా స్పందిస్తుందని చెప్పారు. గత మూడు నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌, మయన్మార్‌, యెమెన్‌తో సహా అవసరమైన దేశాలకు భారత్‌ మాత్రమే 1.8 మిలియన్‌ టన్నులకుపైగా గోధుమలు ఎగుమతి చేసిందని, కరోనాకాలంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేశామని రుచిరా భద్రతా మండలి దృష్టికి తీసుకువచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement