Birthright Citizenship in US: జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు, దానికోసం ప్రపంచమంతా అమెరికాకు రావడానికి ఎగబడితే ఎలా అంటూ సూటి ప్రశ్న
అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చీ రాగానే డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టిన సంగతి విదితమే. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. జన్మహక్కు పౌరసత్వం (Birthright citizenship) ప్రాథమికంగా బానిసల పిల్లల కోసం ఉద్దేశించబడింది
New York, Jan 31: అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చీ రాగానే డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టిన సంగతి విదితమే. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. జన్మహక్కు పౌరసత్వం (Birthright citizenship) ప్రాథమికంగా బానిసల పిల్లల కోసం ఉద్దేశించబడింది.అయితే ప్రపంచం మొత్తం యుఎస్‌లోకి వచ్చి పోగు చేయడం కోసం కాదని ట్రంప్ అన్నారు.
ఒకసారి గతాన్ని గుర్తుచేసుకుంటే.. బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు. అంతేగానీ.. ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికా (USA)లో పోగుపడటం కోసం ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలామంది మన దేశానికి వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
అయితే ట్రంప్ జన్మహక్కు పౌరసత్వానికి వ్యతిరేకంగా కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసిన మరుసటి రోజు సీటెల్‌లోని ఫెడరల్ కోర్టు దానిని కొట్టివేసింది.దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తానని ట్రంప్ చెప్పారు. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని గురువారం విశ్వాసం వ్యక్తం చేశారు.సుప్రీం కోర్ట్‌లో మనం విజయం సాధిస్తామని నేను భావిస్తున్నాను. మేము ఆ కేసులో గెలుస్తామని నేను భావిస్తున్నాను. నేను దానిని గెలవడానికి ఎదురు చూస్తున్నాను." "ఆ స్థాయిలో, ప్రపంచంలో ఇలా చేసే ఏకైక దేశం మనమే" అని ట్రంప్ చెప్పాడు.
అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం.. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒక దానిపై ఇటీవల సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.