Ribs Fractured For Coughing: జస్ట్ దగ్గినందుకు ఎముకలు విరిగిపోయాయి! స్పైసీ ఫుడ్ తిని దగ్గినందుకు చైనా మహిళకు విరిగిన పక్కటెముకలు, ఆశ్చర్యపోతున్న డాక్టర్లు, మరీ ఇంత బలహీనంగా ఉన్నావేంటమ్మా అంటూ చీవాట్లు

ఆమెకు నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. కేవలం విపరీతంగా దగ్గితేనే ఆమె ఛాతీలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న దానికి డాక్టరు కారణం కూడా చెప్పారు. ఆమె ఉండాల్సిన బరువకంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని తెలిపారు.

Ribs Fractured For Coughing:Representational Image (Photo credits: Pixabay)

Shanghai, DEC 08: చైనాలో ఓ మహిళకు పక్కటెముకలు (Fractured Ribs) విరిగాయి. అయితే ఏదో యాక్సిడెంట్‌లోనో...లేక కింద పడితేనో ఎముకలు విరగలేదు. కేవలం దగ్గితేనే ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అందరికీ దగ్గు వస్తుంది, మరి కేవలం ఆమెకు ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? ఇంతకీ ఏం జరిగిందంటే....చైనాలోని షాంఘైనగరంలో ఓ మహిళ విపరీతంగా దగ్గటంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే (Shanghai woman) మహిళ బాగా స్పైసీగా ఉన్న ఆహారం (spicy food) తిన్నది. ఆ తరువాత ఆమెకు దగ్గు వచ్చింది. అలా దగ్గు విపరీతంగా గ్యాప్ (coughing fit ) లేకుండా వచ్చింది. అది కంటిన్యూగా వస్తూనే ఉంది ఆమె దగ్గుతునే ఉంది. దగ్గుతున్న సమయంలో ఛాతీ నుంచి నొప్పి వచ్చింది. కానీ ఆమె పట్టించుకోలేదు. దగ్గే సమయంలో కాస్త పట్టేస్తుండటం మామూలే అనుకుంది. కానీ ఛాతీలో నొప్పిగా బాగా రావటంతో ఆస్పత్రికి వెళ్లింది. జరిగిన విషయం చెప్పింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు CT స్కానింగ్ చేశారు.

Video: అల్బేనియా మాజీ అధ్యక్షుడి ముఖం పగలగొట్టిన ఓ వ్యక్తి, కంటి కింద చిన్న దెబ్బ, నిందితుడు అరెస్ట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

ఆమెకు నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. కేవలం విపరీతంగా దగ్గితేనే ఆమె ఛాతీలోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న దానికి డాక్టరు కారణం కూడా చెప్పారు. ఆమె ఉండాల్సిన బరువకంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని..ఈ క్రమంలో ఆమె స్పైసీ ఫుడ్ తినటంతో వచ్చిన దగ్గు విపరీతంగా రావటంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని చెప్పారు.

North Korea: ఉత్తర కొరియాలో దారుణం, పక్కదేశం సినిమాలు చూశారని ఇద్దరి విద్యార్థులను ప్రజల మధ్యనే కాల్చి చంపిన కిమ్‌ జోంగ్‌ ఉన్ ప్రభుత్వం 

ఆమె 171 సెంటీమీటర్ల పొడవు మరియు కేవలం 57 కిలోల బరువు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆమె కోలుకున్న తర్వాత సరైన భోజనం తిసుకుంటూ కొన్ని వ్యాయామాలు చేస్తే కండరాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement