Video: అల్బేనియా మాజీ అధ్యక్షుడి ముఖం పగలగొట్టిన ఓ వ్యక్తి, కంటి కింద చిన్న దెబ్బ, నిందితుడు అరెస్ట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఆందోళనలో భాగంగా రాజధాని టిరానాలో రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా బెరిసా వద్దకు వచ్చి ఆయన ముఖంపై చేత్తో బలంగా గుద్దాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు
అల్బేనియా మాజీ అధ్యక్షుడు సాలి బెరిషాకు చేదు అనుభవం ఎదురైంది. దేశంలో ముందస్తు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆందోళనలో భాగంగా రాజధాని టిరానాలో రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా బెరిసా వద్దకు వచ్చి ఆయన ముఖంపై చేత్తో బలంగా గుద్దాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో మాజీ అధ్యక్షుడి కంటి కింద చిన్న దెబ్బ తగిలింది. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
Former Albanian president, Sali Berisha, 78, is punched in the face and left with a black eye as thug attacks him during anti-govt protest pic.twitter.com/VcJA72jtpM
— SNOW TV® ??? RC 3662284 (@OfficialSnowtv) December 6, 2022
(The above story first appeared on LatestLY on Dec 07, 2022 03:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

