Ruby Slippers: 85 ఏండ్ల కిందటి ఆ చెప్పుల ఖరీదు రూ.237 కోట్లు.. కెంపులు పొదిగిన ఈ పాదరక్షలు ఎవరివంటే?

రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఈ పాదరక్షలు శనివారం జరిగిన ఆన్‌ లైన్‌ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్‌ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి.

Ruby Slippers (Credits: X)

Newdelhi, Dec 9: ఆ చెప్పులు (Slippers) 85 ఏండ్ల కిందటివి. రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురయ్యాయి. ఇప్పుడు ఈ పాదరక్షలు శనివారం జరిగిన ఆన్‌ లైన్‌ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్‌ డాలర్లకు (రూ.237 కోట్లు) అమ్ముడయ్యాయి. ఈ చెప్పులు కెంపులు (Ruby Slippers) పొదిగినవి మరి. 1939లో విడుదలై ఘన విజయం సాధించిన ది విజార్డ్‌ ఆఫ్‌ ఓజ్‌ అనే అమెరికన్‌ చిత్రంలో ఈ పాదరక్షలను జూడీ గార్లాండ్‌ ధరించి నటించారు.

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం 

అలా మ్యూజియంలోకి..

1969లో గార్లాండ్‌ మరణించగా తదనంతర కాలంలో ఈ విలువైన పాదరక్షలను ఆమె సొంత ఊరు గ్రాండ్‌ రాపిడ్స్‌ పట్టణంలోని జూడీ గార్లాండ్‌ మ్యూజియంలో భద్రపరిచారు. అయితే 2005లో టెర్నీ జాన్‌ మార్టిన్‌ అనే వ్యక్తి వాటిని తస్కరించాడు. 2018లో మార్టిన్‌ నుంచి ఈ చెప్పులను ఎఫ్‌ బీఐ స్వాధీనం చేసుకుంది. తాజాగా వీటిని వేలం వేశారు.

రీల్స్ పిచ్చితో ఒకే బైక్‌ పై ఏడుగురు ప్రయాణం... కఠిన చర్యలకు నెటిజన్ల డిమాండ్ (వీడియో)