Finland PM Drug Test: ప్రధాని డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలు, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న వీడియో వైరల్, డ్రగ్స్ టెస్టు చేయించుకున్న ఫినల్యాండ్ ప్రధాని సనా మారిన్, వారంలో రానున్న రిపోర్టులు, వైరల్ అవుతున్న వీడియో ఇదే!
స్నేహితులతో కలిసి చేసుకున్న విందులో డ్యాన్స్ చేసి వివాదంలో చిక్కుకున్న ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ (Sanna Marin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ విందు సమావేశంలో పాల్గొన్న ప్రధాని సనా మారిన్ (Sanna Marin).. డ్రగ్స్ (Drugs)వాడి ఉంటారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీంతో ఆమె డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు.
Finland, AUG 21 : స్నేహితులతో కలిసి చేసుకున్న విందులో డ్యాన్స్ చేసి వివాదంలో చిక్కుకున్న ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ (Sanna Marin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ విందు సమావేశంలో పాల్గొన్న ప్రధాని సనా మారిన్ (Sanna Marin).. డ్రగ్స్ (Drugs)వాడి ఉంటారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీంతో ఆమె డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. విపక్షాలతోపాటు అందరి సందేహాలు, అనుమానాలు నివృత్తి చేయడానికే నేను డ్రగ్స్ పరీక్ష (Drugs test) చేయించుకున్నా.. వారంలోగా ఫలితాలు వస్తాయి. రిపోర్ట్ రాగానే మీడియా ప్రతినిధులతో షేర్ చేసుకుంటా` అని సనా మారిన్ చెప్పారు. మిత్రుల విందు సమావేశంలో ఆరుగురు మహిళలతో కలిసి మారిన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో (Party video) ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.
సాక్షాత్ ప్రధాని సనా మారిన్.. నేలపై మోకాళ్ల మీద కూర్చుని ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీనిపై విపక్ష నేతలు స్పందిస్తూ.. ప్రధాని సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారేమోనని సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే తనపై వచ్చిన విమర్శలను ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ తోసిపుచ్చారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. `ఒకరోజు సాయంత్రం మిత్రులంతా కలిసి విందు ఏర్పాటు చేసుకున్నాం. అందులో పాటలు పాడటం, డ్యాన్స్‌లు వేయడం నిజమే. మేం ప్రైవేట్‌గా చేసుకున్న ఆ విందు సమావేశం వీడియో లీక్ కావడం దురదృష్టకరం, ఆల్కహాల్ తప్ప ఏ డ్రగ్స్ తీసుకోలేదు. మేం చట్టానికి లోబడే వ్యవహరించాం. ఏ తప్పూ చేయలేదు` అని సనా మారిన్ పేర్కొన్నారు.