India Rejects Canadian Report: హర్దీప్ నిజ్జర్‌ హత్యతో విదేశాలకు సంబంధం లేదు, ఎన్నికల ప్రకియలో జోక్యం ఉందని కెనడా ప్రభుత్వ నివేదిక, ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం

దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో భారత్‌ జోక్యం చేసుకుందని పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్‌.. కమిషన్‌ నివేదికను తోసిపుచ్చింది.

India and Canada Flags (Photo Representative Image)

New Delhi, JAN 29: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ (Nijjar Murder) హత్య కేసుకు సంబంధించి కెనడా ప్రభుత్వం (Canada Govt) ఏర్పాటు చేసిన కమిషన్‌ కీలక విషయం వెల్లడించింది. నిజ్జర్‌ హత్య కేసుకు విదేశాలతో కచ్చితమైన సంబంధం ఉన్నట్లు తేలలేదని పేర్కొంది. నిజ్జర్‌ హత్య కేసులో భారత ఏజెంట్ల హస్తం ఉందని ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) గతంలో చేసిన ఆరోపణల తర్వాత అసత్య ప్రచారాలు జరిగాయని, ఈ క్రమంలోనే ఈ ఆరోపణలను చూడాలని వెల్లడించింది. విదేశంతో సంబంధమున్నట్లు నిరూపితం కాలేదని తెలిపింది.

Trump's Deportation Warning: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ..అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు, కారణం ఏంటంటే.. 

‘కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య సంస్థల్లో విదేశీ జోక్యం’ అంశంపై మేరీ-జోసీ హోగ్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్‌ తాజాగా నివేదిక రూపొందించింది. ఇందులో నిజ్జర్‌ హత్య కేసును ప్రస్తావించిన కమిషన్‌.. దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో భారత్‌ జోక్యం చేసుకుందని పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్‌.. కమిషన్‌ నివేదికను తోసిపుచ్చింది.

Kush Desai: వైట్‌ హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్ర‌ట‌రీగా భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు కుశ్ దేశాయ్‌.. నియ‌మించిన అధ్యక్షుడు ట్రంప్‌  

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ కెనడా వాంకోవర్‌లో 2023 జూన్‌ 18న హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందని, ఇందుకు సంబంధించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటన్నింటిని భారత్‌ తోసిపుచ్చింది. అనంతరం దౌత్యవేత్తల బహిష్కరణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Advertisement
Advertisement
Share Now
Advertisement