Petrol, Diesel Price Hike: డీజిల్‌పై ఒకేసారి రూ. 75 పెంపు, పెట్రోల్‌పై లీటరుకు రూ.50 పెంపు, పెరిగిన ధరలతో పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు చేరిక, శ్రీలంకలో ఆకాశాన్ని తాకుతున్న ఇంధన ధరలు

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని (Petrol, Diesel Price Hike) తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి

Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని (Petrol, Diesel Price Hike) తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఓసీ) నేడు పెట్రోల్, డీజిల్‌ రిటైల్ ధరలను భారీగా (Lanka IOC Hikes Fuel Prices Yet Again) పెంచింది. ఎల్ఐఓసీ సంస్థ ఒక నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడవసారి. డీజిల్ రిటైల్ ధరను లీటరుకు రూ.75, పెట్రోల్‌పై లీటరుకు రూ.50 పెంచినట్లు ఎల్ఐఓసీ ప్రకటించింది.

శ్రీలంక రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు లభిస్తుంది. శ్రీలంక రూపాయి ఏడు రోజుల వ్యవధిలో యుఎస్ డాలరుతో పోలిస్తే రూ.57 క్షీణించింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద పడింది. దీంతో ఆ చమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు, పలు ప్రావిన్స్‌ల్లో లాక్‌డౌన్ అమల్లోకి..

రష్యాను ఏకాకిని చేయడానికి, అమెరికాతో సహ ఇతర పాశ్చాత్య దేశాలు మాస్కో మీద అనేక ఆంక్షలు విధించడం వల్ల చమురు & గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణం" అని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎల్ఐఓసీ ఎటువంటి సబ్సిడీని అందుకోదని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో ధరలు పెంచాల్సి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చమురు, గ్యాస్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు అని మనోజ్ గుప్తా పేర్కొన్నారు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement