Earthquake in Chile: చిలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు
దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనా-చిలీ సరిహద్దుల్లోని అంటోఫగస్టాలో 7.3 తీవ్రతతో భూమి కంపించింది.
Newdelhi, July 19: దక్షిణ అమెరికా దేశమైన చిలీలో (Chile) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. అర్జెంటీనా-చిలీ సరిహద్దుల్లోని అంటోఫగస్టాలో 7.3 తీవ్రతతో భూమి కంపించింది. 128 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు యూరోపియన్-మెడిటేరియన్ సీస్మొలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప ప్రభావం, ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. చిలీని రింగ్ ఆఫ్ ఫైర్ గా (Ring of Fire) పిలుస్తారు. పసిఫిక్ తీరంలో ఉన్న ఈ దేశం అగ్నిపర్వతాలకు నెలవుగా ఉన్నది. దీంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.
14 ఏండ్ల కిందట..
2010లో చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం వల్ల 525 మంది మరణించారు. భూకంపం ధాటికి భారీ సునామీ కూడా వచ్చింది. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది.
వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)