Oldage Prevention (Credits: X)

Newdelhi, July 19: వార్ధక్యాన్ని (Old age) జయించి నిత్య యవ్వనంగా (Young) కొన్నేండ్లపాటు మనుగడ సాగించాలని తరతరాలుగా మనిషి కంటున్న కల. శాస్త్రసాంకేతిక రంగంలో వచ్చిన పెను మార్పులతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంలో  కీలక ముందడుగు పడింది.  మనుషుల జీవితకాలాన్ని పెంచాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఓ ఔషధం ఇప్పుడు వృద్ధాప్యానికి (Anti-Ageing Drug) బైబై చెప్పలనుకొంటున్న మనిషి ఆకాంక్షలకు కొత్త చిగుళ్ళను తొడుగుతున్నది. ఎలుకలపై విజయవంతమైన ఈ ఔషధ ప్రయోగం మనుషుల ఆయుష్షును కూడా పెంచవచ్చని భావిస్తున్నారు.

వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

ఆ ప్రొటీన్ గుట్టురట్టు

వయసు పెరుగుదలకు ఇంటర్ ల్యూకిన్ - 11 అనే ప్రొటీన్ కారణమవుతున్నట్టు తొలుత పరిశోధకులు గుర్తించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై ఐఎల్-11 కీలక ప్రభావం చూపుతున్నట్టు తెలుసుకున్నారు. వయసుతో పాటు ఈ ప్రొటీన్  ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ శారీరక ధృడత్వాన్ని తగ్గించి, తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగిస్తోందని తెలిపారు. ఐఎల్-11 ప్రొటీన్‌ ఉత్పత్తిని కట్టడి చేసే కొత్త డ్రగ్ ను అభివృద్ధి చేసిన  శాస్త్రవేత్తలు తద్వారా ఎలుకల జీవిత కాలం 25 శాతం మేర పెంచగలిగారు. ప్రస్తుతం ఈ ప్రయోగాలను మనుషులపై కూడా చేయాలని నిర్ణయించారు.

నేను రెడీ, నువ్వు రెడీనా, రాజీనామాపై హరీష్ రావు కీలక ప్రకటన, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేయకుండా..

ఎవరు అభివృద్ధి చేశారు?

లండన్‌ లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన ఎంఆర్‌సీ ల్యాబొరేటరీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, సింగపూర్‌ లోని డ్యూక్‌-ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ కు చెందిన పరిశోధకులు ఈ ఔషధాన్ని తయారు చేశారు.