Harish Rao vs Revanth Reddy (photo-File image)

Hyd, July 18: రైతు రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. తనకు పదవులు కొత్త కాదని, రాజీనామాలు కొత్త కాదని పేర్కొన్న ఆయన... ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు మంచి జరుగుతుందంటే తాను ఎన్నిసార్లైనా పదవులకు రాజీనామా చేయడానికి వెనుకాడబోనని అన్నారు.  రైతు బంధు డబ్బులే రుణమాఫీకా?..సీఎం రేవంత్‌ రెడ్డిది దగా అని మండిపడ్డ కేటీఆర్

మరోసారి చెబుతున్నా ఆగష్టు 15 లోగా రాష్ట్రంలోని రైతులు అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’’ అని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి హరీశ్ రావు సవాలు విసిరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది మీరేనని ధ్వజమెత్తారు.  రుణమాఫీ నిధులు విడుదల..తెలంగాణలో పండగరోజు అన్న సీఎం రేవంత్..రాహుల్ గాంధీతో వరంగల్‌లో భారీ బహిరంగసభ

కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపింది తమరేనని ఎద్దేవా చేశారు. నిరంతరం పారిపోయిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర మాదేనని స్పష్టంచేశారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే.. మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది అని అన్నారు.

Here's Video

నాకు పదవులు, రాజకీయాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనన్నారు.