Hyd, July 16: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడత రైతు రుణమాఫీ నిధులు రూ.6098 కోట్లు జమచేయగా 11 లక్షల 50 వేల మంది రైతులకు లబ్ది చేకూరింది. రుణమాఫీ నిధుల విడుదలతో రైతుల మొహాల్లో ఆనందం వెల్లి విరుస్తుండగా గ్రామగ్రామన రైతులు సంబరాలు చేసుకున్నారు.
రెండో విడతలో ఈ నెలాఖరు వరకు లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణా బకాయిలను విడుదల చేస్తామని ప్రకటించారు రేవంత్. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాసానమని చెప్పారు రేవంత్. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటామని, రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని తేల్చిచెప్పారు.
గతంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేదాని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో మాట ఇచ్చిన విధంగానే రుణమాఫీ చేశామని, త్వరలో రాహుల్ గాంధీని తెలంగాణకు ఆహ్వానిస్తామన్నారు. ఎక్కడ మాట ఇచ్చామో అక్కడే తిరిగి రైతులతో సంబరాలు చేస్తామని తేల్చిచెప్పారు రేవంత్. తెలంగాణలో ఇవాళ రైతులందరికి పండగ రోజు అని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను నిండా ముంచిందన్నారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈరోజును మర్చిపోలేనని చెప్పారు రేవంత్. రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా రైతులతో వర్చువల్‌గా మాట్లాడారు సీఎం రేవంత్. జూలై 23న అసెంబ్లీ,24 నుండి మండలి సమావేశాలు ప్రారంభం, పార్టీ ఫిరాయింపు,నిరుద్యోగ సమస్యే ప్రధాన ఎజెండా
రాష్ట్రంలో ఉన్న షెడూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకారం కేంద్ర బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తించనుంది.