Mosquitoes Released to Save Rare Birds: దోమకాటుతో అంతరించిపోతున్న పక్షిజాతిని రక్షించేందుకు అమెరికా కీలక నిర్ణయం.. హెలికాప్టర్లతో లక్షలాది మగదోమల విడుదల.. ఎందుకంటే??
అమెరికాలోని హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి.
Newyork, June 22: అమెరికాలోని (America) హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే అత్యంత అరుదైన పక్షిజాతులు (హనీక్రీపర్స్) అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి. దోమకాటుతో (Mosquitoes Bite) వచ్చే మలేరియా వాటి ఉనికికి ప్రమాదంగా మారింది. మలేరియాను ఎదుర్కునే రోగనిరోధక శక్తి వీటికి లేకపోవడంతో 90 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో బాగా యోచించిన హవాయి రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను ఈ దీవుల్లో విడిచిపెడుతోంది.
ఎందుకంటే?
హనీక్రీపర్స్ పక్షిజాతిని రక్షించుకునేందుకు చర్యలు ప్రారంభించిన హవాయి రాష్ట్ర ప్రభుత్వం వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమల ఉత్పత్తి ప్రారంభించింది. వాటితో కలిసిన ఆడదోమలు గుడ్లు పొదగలేవు. కాబట్టి క్రమంగా వాటి సంతతిని నివారించవచ్చన్నది ప్రభుత్వ యోచన. అలా హెలికాప్టర్లతో లక్షలాది మగదోమలను ఈ దీవుల్లో విడిచిపెడుతోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement