Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి క్ష‌మాభిక్ష ప్రసాదించిన మయన్మార్ సైనిక ప్ర‌భుత్వం, గృహ‌నిర్బంధంలోనే ఉంచ‌నున్న‌ట్లుగా వార్తలు

మ‌య‌న్మార్ పౌర ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ(Aung San Suu Kyi)కి సైనిక ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా సైనిక ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు భావిస్తున్నారు.

Aung San Suu Kyi (Photo Credits: Twitter@Reaproy)

Myanmar's Aung Suu Kyi Pardoned By Military Junta: మ‌య‌న్మార్ పౌర ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ(Aung San Suu Kyi)కి సైనిక ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా సైనిక ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు భావిస్తున్నారు.

క్ష‌మిభిక్ష కింద ఆమెపై ఉన్న అయిదు కేసుల్ని ర‌ద్దు చేయగా.. మ‌రో 14 కేసులు అలాగే ఉన్న‌ట్లు తాజా స‌మాచారం ప్ర‌కారం తెలుస్తోంది. రాజ‌ధాని నైపితాలో ప్ర‌స్తుతం నోబెల్ గ్ర‌హీత సూకీని హౌజ్ అరెస్టు చేశారు. ఏడాదిగా ఆమె క‌ఠిన జైలు జీవితాన్ని అనుభ‌విస్తున్నారు. ఎన్నిక‌ల ఫ్రాడ్‌కు చెందిన కేసుల్లో ఆమె కోర్టులో పోరాడుతోంది. త‌న‌పై చేసిన అభియోగాల‌ను ఆమె ఖండించారు.

క్ష‌మాభిక్ష క‌ల్పించినా.. ప్ర‌స్తుతానికి సూకీని గృహ‌నిర్బంధంలోనే ఉంచ‌నున్న‌ట్లు మ‌య‌న్మార్ రేడియో వెల్ల‌డించింది. 78 ఏళ్ల సూకీ తొలిసారి 1989లో అరెస్టు అయ్యారు. 1991లో ఆమెకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ద‌క్కింది. 2010లో ఆమె హౌజ్ అరెస్టు నుంచి విముక్తి అయ్యారు. 2015 ఎన్నిక‌ల్లో ఆమె పార్టీ మ‌య‌న్మార్‌లో నెగ్గింది. కానీ సంస్క‌ర‌ణ‌లను వ్య‌తిరేకించిన సైన్యం మ‌ళ్లీ తిరుగుబాటు చేసింది.

చైనాలో భారీగా పెరిగిన కండోమ్ సేల్స్, కారణం తెలిస్తే అవాక్కవుతారు..

కాగా 2021లో సూకీని సైన్యం అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. వేర్వేరు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చారు.  ఇదిలా ఉంటే దేశ‌వ్యాప్తంగా దాదాపు ఏడువేల మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష క‌ల్పిస్తున్న‌ట్లు స్థానిక మీడియా తెలిపింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ

Vallabhaneni Vamsi Mohan Arrest: డీజీపీ అప్పాయింట్‌మెంట్ ఇస్తే వచ్చాం, అయినా కలవకుండా వెళ్లిపోయారు, తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంబటి రాంబాబు

Harish Rao Padayatra: త్వరలో మాజీ మంత్రి హరీశ్‌ రావు పాదయాత్ర.. ఎమ్మెల్సీ కవిత మహిళా శంఖారావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట, వివరాలివే

Advertisement
Advertisement
Share Now
Advertisement