![](https://test1.latestly.com/uploads/images/2025/02/17-220.jpg?width=380&height=214)
Vjy, Feb 13: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి విదితమే. రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు.
దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, వంశీపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని.. చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తింది. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని, ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి రాంబాబు మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు వంశీ. ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు.
దీనిపై డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నాం. డీజీపీ ఆఫీస్ కు అపాయింట్ మెంట్ ఇస్తే వచ్చాం.. అయినా వారిని కలవలేదు. రిప్రజెంటేషన్ఇ వ్వడానికి ఈరోజు(గురువారం) సాయంత్రం 4.35కి అపాయింట్ మెంట్ ఇచ్చారు. మేము 4.30కే డీజీపీ ఆఫీస్ కి వచ్చాం. అప్పుడు డీజీపీ ఉన్నారు.. కానీ కాసేపటికి వెళ్లిపోయారని చెప్పారు. మరి మా రిప్రంజటేషన్ ఎవ్వరూ తీసుకోలేదు. ఇదేంటో అర్థం కావడం లేదు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉంది. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి డీజీపీ ఎవరినైనా పంపిస్తారా? లేక మేమే మళ్లీ వచ్చి కలవాలా? అని అంబటి మీడియా ముఖంగా ప్రశ్నించారు.