New Drug RLF-100: అంగస్తంభన ఔషధంతో కరోనాకు చెక్, ఆర్ఎల్‌ఎఫ్-100 కోవిడ్ కు విరుగుడుగా పనిచేస్తుందని తెలిపిన హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్, సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలు

అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్) (New Drug RLF-100) ఔషధం కరోనాకు విరుగుడుగా ఉపయోగపడుతోందని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా ఈ ఓౌషధం ముక్కు ద్వారా పీల్చడం ద్వారా అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఔషదాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులకు బహుళ క్లినికల్ సైట్లలో అత్యవసరంగా ఉపయోగించడం కోసం ఎఫ్‌డీఏ (FDA) చేత ఆమోదించబడింది.

Coronavirus Vaccine (Photo Credits: ANI)

Houston, Aug 7: కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కోవిడ్ 19 నిర్మూలనకు వ్యాక్సిన్ ఏదీ ఇంతవరకు అందుబాటులో లేదు. అన్నీ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఏ దేశం ముందుగా వ్యాక్సిన్ తీసుకువస్తుందో చెప్పలేని పరిస్థితి. మూడు లేదా నాలుగు వ్యాక్సిన్లు స్టేజ్ 3 దాటుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఔషధం కరోనాకు విరుగుడుగా పనిచేస్తుందనే వార్త బయటకు వచ్చింది.

ఇప్పుడు కొత్తగా అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్) (New Drug RLF-100) ఔషధం కరోనాకు విరుగుడుగా ఉపయోగపడుతోందని పరిశోధనల్లో తేలింది. సాధారణంగా ఈ ఓౌషధం ముక్కు ద్వారా పీల్చడం ద్వారా అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఔషదాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులకు బహుళ క్లినికల్ సైట్లలో అత్యవసరంగా ఉపయోగించడం కోసం ఎఫ్‌డీఏ (FDA) చేత ఆమోదించబడింది. చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

ఈ ఔషధం చికిత్సలో వాడిన తర్వాత వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితులు వేగంగా కోలుకున్నట్లు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ నివేదించింది. ఈ మందు పేటెంట్‌ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ఔషధాన్ని ఉపయోగించి కరోనా బాధితులకు చికిత్స (COVID-19 Patients) అందించేందుకు జూన్ నెలలో అనుమతులు లభించాయి. అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ

అమెరికాలోని హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 54 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో అతనికి కరోనా సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తడంతో అతనికి ఆర్ఎల్‌ఎఫ్-100 ఔషదాన్ని ఇచ్చారు. అతడి ఆరోగ్యం నాలుగు రోజుల వ్యవధిలోనే మెరుగుపడి వెంటిలేటర్‌పై నుంచి జనరల్‌ వార్డుకు మారారు. మరో 15 మంది కూడా ఇదే విధంగా త్వరగా కోలుకున్నారు. దీంతో మరి కొందరిపై ఈ ఔషధాన్ని ప్రయోగాలు చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగ ఫలితాలు మరింత సానుకూలంగా వస్తే కరోనా నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంది. కాగా.. ఆర్‌ఎల్‌ఎఫ్‌-100 ఔషదం వాడటం వల్ల మోనోసైట్స్‌లో తెల్లరక్తకణాల సంఖ్య వృద్ధి చెందకుండా నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదిలా ఉంటే కరోనా మహమ్మారిని (Coronavirus) తరిమి కొట్టడానికి తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్‌ తయారుగా ఉందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అయితే ఈ వాక్సిన్‌ని మానవ ప్రయోగం చేయాల్సి ఉందని, దీన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి బెన్నీ గాంట్జ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ ప్రయత్నాలను పరిశీలించేందుకు ఇజ్రాయెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ రీసెర్చ్‌(ఐఐబీఆర్‌)ని సందర్శించారు.

కరోనా వైరస్‌ని ఎదుర్కోవడానికి యాంటీ బాడీస్‌ని ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌ తయారీ ముందంజలో ఉందని, ఐఐబీఆర్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ షపీరా వివరించారు. ఈ వ్యాక్సిన్‌ ఎప్పటికి వస్తుందో ఐఐబీర్‌ ప్రకటించలేదు. భారీ స్థాయిలో ఈ వ్యాక్సిన్‌ని తయారుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఐఐబీఆర్‌ రక్షణ శాఖతో కలిసి ఈ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement