Pakistan Shocker: పాకిస్తాన్‌లో దారుణం, హోటల్లో నిర్బంధించి అమెరికా యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులు
అమెరికాకు చెందిన 21 ఏండ్ల యువతిపై ఓ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేషన్ ఫోర్ట్ మాన్‌రోయ్‌లో జులై 17న యువతిని నిర్బంధించి అత్యాచారానికి (American Woman Gang Raped) పాల్పడ్డారు
Lahore, July 20: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ ఘటన (Pakistan Shocker) చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన 21 ఏండ్ల యువతిపై ఓ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేషన్ ఫోర్ట్ మాన్‌రోయ్‌లో జులై 17న యువతిని నిర్బంధించి అత్యాచారానికి (American Woman Gang Raped) పాల్పడ్డారు. బాధిత యువతి.. టూరిస్ట్ వీసాపై ఏడు నెలల క్రితం పాకిస్తాన్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఫేస్‌బుక్‌లో ముజామిల్ సిప్రా, అజాన్ ఖోషా అనే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు.
అయితే ఆదివారం రోజు ఫోర్ట్ మాన్‌రోయ్ సందర్శిద్దాం.. అక్కడికి రావాలని అమెరికా యువతిని వారిద్దరూ కోరారు. దీంతో ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత ఓ హోటల్‌లో (Punjab Province Hotel) నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వీడియోను కూడా చిత్రీకరించి, ఆమెను బెదిరింపులకు గురి చేశారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముజామిల్ సిఫ్రాను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.
డిప్యూటీ కమిషనర్ అన్వర్ బార్యార్ D.G ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.., అమెరికన్ అమ్మాయి తన సోషల్ మీడియా స్నేహితుడు ముజ్మల్ సిప్రా ఆహ్వానంపై కరాచీ నుండి ఫోర్ట్ మన్రోకి వచ్చింది. లాహోర్‌కు 550 కిలోమీటర్ల దూరంలో పంజాబ్‌లోని రాజన్‌పూర్ జిల్లాలో ఆదివారం ఆమె ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి ఫోర్ట్ మన్రోను సందర్శించి సిప్రా మరియు అతని స్నేహితుడు అజాన్ ఖోసాతో కలిసి ఆమను హోటల్ రూంకి తీసుకువెళ్లారు.
అక్కడ ఇద్దరు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ చర్య యొక్క వీడియో కూడా చేసారు" అని ఆమె ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించిందని తెలిపారు. పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 మరియు 292 బి కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతర నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి హమ్జా షెహబాజ్ ఈ ఘటనపై దృష్టి సారించారు మరియు కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని పంజాబ్ పోలీసు చీఫ్‌ను ఆదేశించారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు తప్పవని, బాధితురాలికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు