Rupert Murdoch Engagement: 92 ఏళ్ళ వయసులో 5వ పెళ్లి, హానీమూన్ ప్లాన్ ఎక్కడో తెలుసా బ్రిటన్‌లో, ప్రియురాలు 65 ఏండ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ను వివాహం చేసుకోబోతున్ బిలియనీర్ రూపర్ట్ మర్దోక్

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 5వ సారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 92 ఏండ్ల వయసులో తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ (Ann Lesley Smith)ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.

Rupert Murdoch and his ex-wife Jerry Hall. (Photo credits: Twitter/ANI)

ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 5వ సారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 92 ఏండ్ల వయసులో తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ (Ann Lesley Smith)ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.

మార్చి 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో వీరి ఎంగేజ్మెంట్‌ ఘనంగా జరిగింది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసని రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా పూర్తికాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

మోదీకి ముద్దు పేరు పెట్టుకున్న చైనీయులు, మోదీ లాక్షియన్ అంటూ చైనా సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం

మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్‌ (Patricia Booker)ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్‌ (Anna Maria) ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్‌ (Wendi Deng )ని పెళ్లిచేసుకుని 2013 వరకూ కలిసి ఉన్నారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్‌ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐదోసారి లెస్లీ స్మిత్‌తో వివాహానికి సిద్ధమయ్యారు.

వీడియో ఇదిగో, లండన్‌లోని భారత హైకమిషన్ భవనం ముందు త్రివర్ణ పతాకం రెపరెపలు

ఆయనకు కాబోయే భార్య లెస్లీ స్మిత్‌ (Ann Lesley Smith) భర్త కూడా ఓ వ్యాపారవేత్తనే. 14 ఏండ్ల క్రితమే ఆయన చనిపోయారు. అప్పటి నుంచి ఒంటిరగా ఉన్న లెస్లీ.. మర్దోక్‌ చేసిన పెండ్లి ప్రతిపాదనకు అంగీకారించింది. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. మర్దోక్, స్మిత్‌ల వివాహం ఈ వేసవిలో జరగనుండగా.. అమెరికా, బ్రిటన్‌లో గడపాలని కొత్త జంట భావిస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement