PM Narendra Modi (Photo-ANI)

New Delhi, Mar 20: భారత్, చైనాల మధ్య సరిహద్దు గొడవలతో ప్రతి క్షణం బార్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న సంగతి విదితమే. అయినప్పటికీ చైనీయులు భారత ప్రధాని మోదీని అమితంగా ఇష్టపడుతున్నారని అమెరికా పత్రిక డిప్లొమాట్ తాజాగా ఓ కాలమ్‌ను ప్రచురించింది. అందులో చైనా జర్నలిస్టు ము షుంసాన్ రాసిన కథనం ప్రకారం..చైనా నెటిజన్లు భారత ప్రధానిని ‘ మోదీ లాక్షియన్’ అని ముద్దు పేరుతో (PM Modi Nickname in China) పిలుచుకుంటున్నారు. అసాధారణ ప్రజ్ఞ ఉన్న వృద్ధుడైన దివ్య పురుషుడని (Modi the immortal) దీని అర్థం.

వీడియో ఇదిగో, లండన్‌లోని భారత హైకమిషన్ భవనం ముందు త్రివర్ణ పతాకం రెపరెపలు

ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) వస్త్రధారణ, రూపం విభిన్నంగా ఉంటాయని, ఆయన విధానాలు గత నేతలకన్నా భిన్నాంగా ఉంటాయని తన కథనంలో ము షుంషాన్ విశ్లేషించారు. రష్యా, అమెరికా, దక్షిణ దేశాలతో స్నేహంగా ఉంటూ మోదీ వాటి మధ్య సమతూకం పాటిస్తారని వ్యాఖ్యానించారు. చైనా ప్రజల దృష్టిలో మోదీకి ఓ అసాధారణ స్థానముందని కూడా పేర్కొన్నారు.

జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. కొలంబియాలో ఘటన.. వీడియో వైరల్

చైనా ప్రజలు ఓ విదేశీ నేతకు ముద్దుపేరు పెట్టడం ఎప్పుడూ చూడలేదని కూడా పేర్కొన్నారు. చైనా సోషల్ మీడియా వేదికైన ‘సైనా వీబో’లో మోదీ 2015లో చేరినట్టు చెప్పారు. ఆయనకు 2.44 లక్షల ఫాలోవర్లు ఉండేవారని, అయితే.. 2020లో చైనా యాప్‌లపై భారత్ విధించిన నిషేధం కారణంగా మోదీ తన అకౌంట్‌ను మూసేశారని చెప్పుకొచ్చారు.