Oklahoma House Fire: అయ్యో పాపం! ఓ ఇంట్లో ఎనిమిది శవాలు, ఆత్మహత్యా? లేక హత్యా? అనే అనుమానం, మృతుల్లో ఆరుగురు చిన్నారులు, మర్డర్ చేసి సూసైడ్‌గా చిత్రీకరించేందుకు భారీ కుట్ర చేశారంటున్న సాక్షులు

కానీ వీరు మరణాలు అగ్ని ప్రమాదం వల్ల మరణించినట్లు కనిపించడంలేదని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా తెలపడంతో ఈ ఘటనపై మరింత మిస్టరీగా మారింది

Credit @ Twitter

Oklahoma, OCT 29: అమెరికాలోని ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఒక్లహామా (Oklahoma) రాష్ట్రం బ్రోకెన్ యారో పట్టణంలో గురువారం సాయంత్రం 4 గంటలకు మంటల్లో తగులబడిపోతున్న ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిదిమంది చనిపోయి (Eight died) కనిపించారు. వారు ఆత్మహత్యలు చేసుకున్నారా? లేదా ఎవరైనా వారిని చంపటానికి ఇల్లు తగులబెట్టారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటల్లో కాలిపోయిన ఆ ఇంట్లో ఉన్న పెద్దలు.. మొదట పిల్లలను చంపి తరువాత ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వీరందరినీ ఇంకెవరైనా హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ (Suicide) చేయటానికి వారి ఇంటికి నిప్పు పెట్టారా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని బ్రోకెన్ యారో పోలీస్ చీఫ్ బ్రాండన్ బెర్రీహిల్ తెలిపారు. కాలిపోయిన ఇంట్లోనుంచి కొన్ని తుపాకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవటం..మంటల్లో తగులబడిపోతున్న ఆ ఇంట్లో ఓ వ్యక్తి స్పృహలో లేని ఓ మహిళను లాక్కెళ్లటం తాను చూసానని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పటం వంటి పలు విషయాలను బట్టి చూస్తే ఎవరో కావాలనే ఆ ఇంట్లోవారిని హత్య చేసిన అగ్నిప్రమాదంగా చిత్రీకరించగానికి యత్నించినట్లుగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Human Washing Machine: ఈ మిషన్ బట్టల్ని కాదు, మనుషుల్ని ఉతుకుతుంది! జపాన్ సైంటిస్టులు కొత్త సృష్టి, మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ టెస్టింగ్, త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి....ఎలా పనిచేస్తుందో తెలుసా? 

ఈ ఇంట్లో కాలిపోయిన చనిపోయిన ఆరుగురు చిన్నారులు (Six children killed) ఒక సంవత్సరం నుంచి 13 ఏళ్ల లోపు వారని పోలీస్ చీఫ్ బ్రాండన్ బెర్రీహిల్ తెలిపారు. కానీ వీరు మరణాలు అగ్ని ప్రమాదం వల్ల మరణించినట్లు కనిపించడంలేదని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా తెలపడంతో ఈ ఘటనపై మరింత మిస్టరీగా మారింది. పైగా కటెలిన్ పవర్స్ అనే ఓ మహిళ ఈ ఘటన గురించి మాట్లాడుతూ..‘ తాను కారులో వెళుతుండగా ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తుండటం గుర్తించానని ఆ సమయంలో ఇంటి ముందు ఓ వ్యక్తి స్పృహలో లేని ఒక మహిళను ఈడ్చుకెడుతూ కనిపించాడని చెప్పటం గురించి ఆలోచిస్తే ఈ ఘటన అగ్నిప్రమాదం కాదని..ఎవరో కావాలనే వీరిని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి అగ్నిప్రమాదంగా క్రియేట్ చేశారని తెలుస్తోంది.

US Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు, ట్రక్కును ఢీకొట్టిన మినీ వ్యాన్ 

ఈ ఘటన గురించి కటెలిన్ మరింతగా చెబుతూ..నేను ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, ఇంటి పైభాగంలో నుండి పొగలు రావడం చూశాను..అది అటకలాగా అనిపించింది’ అని మీడియాకు తెలిపారు. ఆమె చూసేసరికి ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఇంటి ముందు నిలబడి ఉన్నారు. మరొక వ్యక్తి స్పృహలో లేని మరో మహిళను స్త్రీని లాగుతూ ముందు తలుపు నుండి బయటికి వచ్చాడని..సదరు బాధిత మహిళ రెండు చేతులు విరిగిపోయి ఉన్నాయని ఆమె తెలిపింది.”ఆమెకు 20 ఏళ్లు ఉండొచ్చని..ఆమె చాలా పొట్టిగా ఉండే షార్ట్, టైట్ షర్ట్‌లో ఉందని..కాస్త ఛామనచాయలో ఉందని తెలిపింది కటెలిన్. మహిళ చనిపోయిందని వారు ఆమె పిల్లలు అయి ఉండొచ్చని తెలిపింది. దాదాపు 1,15000 మంది నివసించే బ్రోకెన్ యారో తుల్సాలోని అతిపెద్ద శివారు ప్రాంతం. 2015లో ఓ ఇంటిలో నివసిస్తున్న ఇద్దరు టీనేజర్ సోదరులు,వారి తల్లి,తండ్రి, ఇద్దరు తమ్ముళ్లతో పాటు వారి ఒక సోదరి హత్యలు జరిగాయి. ఈ హత్యలు జరిగిన ఇంటిని కూల్చివేసి ఆ స్థలాన్ని కమ్యూనిటీ పార్కుగా మార్చారు. బ్రోకెన్ యారో తుల్సా శివారు ప్రాంతం కాబట్టి దీంతో సదరు బాదిత కుటుంబాన్ని పక్కా ప్లాన్ తోనే హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif