COVID-19 Variant C12: మళ్లీ ఇంకో కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల్లో కరోనా C.1.2 వేరియంట్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌కు సైతం ఈ కొత్త వేరియంట్ లొంగదని నివేదికలో వెల్లడి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ సరికొత్త వేరియంట్లతో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో C.1.2 అనే కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను(New Covid variant) శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Johannesburg, August 31: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ సరికొత్త వేరియంట్లతో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో C.1.2 అనే కొత్త కరోనా వైరస్ వేరియంట్‌ను(New Covid variant) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వేరియంట్ మరింత వేగంగా, చాలా సమర్థవంతంగా వ్యాప్తి చెందుతుందని.. టీకాల అందించే రక్షణను సైతం తప్పించుకోగలదని తాజా అధ్యయనం వెల్లడించింది.
దక్షిణాఫ్రికా(South Africa) జాతీయ అంటువ్యాధుల సంస్థ(NICD), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్‌ఫామ్ సంస్థల శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ C.1.2 వేరియంట్ ను మే నెలలో సౌత్ ఆఫ్రికా దేశంలో మొదటిసారిగా గుర్తించామని వెల్లడించారు. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో గుర్తించిన ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రమాదకరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన కేఆర్ఐఎస్పీ సంస్థతో జరిపిన పరిశోధనలో కరోనా కొత్త వేరియంట్ సీ 1.2 బయటపడిందని అంటున్నారు.
2021 మే నెలలోనే ఈ వేరియంట్‌ను గుర్తించామని..ఆగస్టు నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్లలో ఈ వేరియంట్ జాడలు కన్పించాయని చెబుతున్నారు. కొత్త వేరియంట్లు(Covid New Variant)రావడం సహజమే అయినా ఈ వేరియంట్ కాస్త ప్రత్యేకంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌కు(Corona Vaccine)ఈ వేరియంట్ అందదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతోంది. కరోనా వ్యాక్సిన్ కల్పించే రక్షణ వ్యవస్థను దాటుకుని ఈ వేరియంట్ ముందుకు పోతుందని నిపుణుల పరిశోధనలో వెల్లడైంది.
ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ ఉత్పరివర్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్ఐసీడీ(NICD) శాస్త్రవేత్తలు తెలిపారు. అటు దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ జీనోమ్స్ సంఖ్య పెరుగుతూ వస్తోందని అధ్యయనం తెలిపింది. ఈ వేరియంట్లో మ్యూటేషన్ రేటు 41 శాతం ఉందని తెలుస్తోంది. సీ 1.2 వేరియంట్లో(Corona C 1.2 Variant) కన్పించే కొత్త రకాల మ్యూటేషన్లు క్లాస్ 3 యాంటీబాడీలను(Antibodies) తప్పించుకోగలదని తేలడం ఆందోళనను పెంచుతోంది. ఈ వేరియంట్లో ఎన్ 440 కే, వై 449 హెచ్ మ్యూటేషన్లు ఉన్నట్టు కనుగొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)