Donald Trump Sand Art: ట్రంప్‌ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్.. ప్రమాణం నేపథ్యంలో ట్రంప్‌ సైకత శిల్పం

నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.

Donald Trump Sand Art (Credits: X)

Newyork, Jan 20: నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (America Presidential Elections) ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) (Donald Trump) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు. కాగా, ఒడిశాలోని పూరికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్ ట్రంప్‌ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 47 అడుగుల పొడవైన ట్రంప్ సైకత శిల్పాన్ని పూరి బీచ్‌ లో ఆయన ప్రదర్శించారు. 'congratulations, వైట్ హౌస్‌ కు స్వాగతం' అంటూ ఇంగ్లీషు అక్షరాలతో రాశాడు. ఇది పలువురిని ఆకర్షిస్తున్నది.

'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్

రోటుండా ఇండోర్‌ లో ప్రమాణం.. ఎందుకంటే?

వాషింగ్టన్ లో ప్రస్తుతం మైనస్ 11 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈ క్రమంలో ట్రంప్  ప్రమాణ స్వీకార వేడుకను బహిరంగంగా కాకుండా కేపిటల్ హిల్‌ లోని రోటుండా ఇండోర్‌ లో నిర్వహించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అభిమానులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాషింగ్టన్ చేరుకున్నారు. సెయింట్ జాన్స్ చర్చిలో ప్రార్థనలతో ట్రంప్ తన రోజును ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి వైట్‌ హౌస్‌ కు చేరుకుని అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి కేపిటల్ హిల్‌ కు చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణం అనంతరం తొలి రోజే ట్రంప్ 100కు పైగా ఆదేశాలపై సంతకాలు చేస్తారు.  ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు ఇందులో ఉన్నట్టు సమాచారం.

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ల వికృత క్రీడలు.. పాఠశాల స్టాఫ్‌ రూమ్‌ లో రాసలీలలు.. (వీడియోతో)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement