Covid cases in UK: యూకేలో కరోనా బీభత్సం, ఒక్కరోజే 2లక్షల కేసులు, రికార్డులు బద్దలు కొడుతున్న కొత్త కేసులు, ఆస్పత్రుల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
బ్రిటన్‌లో (Britain) కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు సరికొత్త రికార్డు స్థాయి(Daily cases on High)కి చేరాయి. దేశంలో ఒకేరోజు రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి బ్రిటన్‌లో ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి
Britain January 05: బ్రిటన్‌లో (Britain) కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు సరికొత్త రికార్డు స్థాయి(Daily cases on High)కి చేరాయి. దేశంలో ఒకేరోజు రెండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి బ్రిటన్‌లో ఒకే రోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
యునైటెడ్ కింగ్‌డమ్(United Kingdom)లో మంగళవారం 2,18,724 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 48 మంది మరణించడటంతో మొత్తం మృతులు 1,48,941కి పెరిగారు. అదేవిధంగా 14,126 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
యూకే(UK)లో ఇప్పటివరకు 12 ఏండ్ల వయస్సు పైబడినవారిలో 90 శాతానికిపైగా మంది కరోనా వ్యాక్సిన్(Corona vaccine) మొదటి డోసు తీసుకున్నారు. అదేవిధంగా సుమారు 82 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారు. భారీగా రోజువారీ కేసులు నమోదవుతున్నప్పటికీ దేశంలో ఇప్పటికిప్పుడే ఆంక్షలు విధించే ఉద్దేశమేదీ లేదని బ్రిటిష్ హెల్త్ సెక్రెటరీ వెల్లడించారు. అమెరికా లాగా హోం క్వారంటైన్‌ను ఏడు నుంచి ఐదు రోజులకు తగ్గించే ప్రణాళికలేమీ లేవన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)