HIV Horror in US: దారుణం, ఎయిడ్స్ ఉందని తెలిసి కండోమ్ లేకుండా 200 మందితో సెక్స్‌లో పాల్గొన్న అమెరికన్ మహిళ, విషయం తెలిసి హెల్త్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. HIV ఉన్న మహిళ ఏకంగా 200 మందికి పైగా పురుషులతో శృంగారం చేసింది.తన ద్వారా మిగతా వారికి అంటుతుందని తెలిసీ కండోమ్ లేకుండానే అందరితో శృంగారంలో పాల్గొంది. 2022 నుంచి విటులతో గడుపుతూ వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టిన సదరు మహిళను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

HIV (Photo-Pixabay)

అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. HIV ఉన్న మహిళ ఏకంగా 200 మందికి పైగా పురుషులతో శృంగారం చేసింది.తన ద్వారా మిగతా వారికి అంటుతుందని తెలిసీ కండోమ్ లేకుండానే అందరితో శృంగారంలో పాల్గొంది. 2022 నుంచి విటులతో గడుపుతూ వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టిన సదరు మహిళను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులను అప్రమత్తం చేయడానికి హెల్త్ అలర్ట్ ప్రకటించారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓహియోలోని మరియెట్టాకు చెందిన లిండా లెచెసే అనే సెక్స్ వర్కర్ కు 2022 లో హెచ్ఐవీ సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తన పనికి స్వస్తి పలకాల్సిన లిండా అలా చేయలేదు. మరింత మందితో శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 2022 నుంచి ఇప్పటి వరకు 211 మందితో సన్నిహితంగా గడిపినట్లు పోలీసుల దర్యాఫ్తులో తేలింది. దీంతో లిండాను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె కస్టమర్లు 211 మందికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తనకు HIV ఉన్నా దాచి ఆరేళ్ల నుంచి భార్యతో శృంగారంలో పాల్గొన్న భర్త, విషయం తెలిసి షాకయిన భార్య, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతోపాటు తమ దృష్టికి రాని కస్టమర్లు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలని అడుగుతున్నారు. లిండాకు హెచ్ఐవీ ఉందని బయటపడడంతో గతంలో ఆమెతో గడిపిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement