Joe Biden Stumbles Twice Video: విమానం ఎక్కుతూ తూలి పడబోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫిటినెస్, మతిమరుపుపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
మెట్లపై పడిపోయే ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే మరోసారి తూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ బైడెన్ తూలిపడబోయాడు. మెట్లపై పడిపోయే ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే మరోసారి తూలడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. విమానం ఎక్కేందుకు ఉపయోగించే మెట్లు చాలా చిన్నగా ఉంటాయని, అలాంటి మెట్లు ఎక్కడానికీ బైడెన్ తడబడ్డారంటే ఆయన ఫిట్ నెస్ పై అనుమానాలు రావడం సహజమేనని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
ఈ ఏడాది 82వ వసంతంలోకి అడుగుపెట్టనున్న బైడెన్..విదేశీ నేతల పేర్లతో పాటు తమ పార్టీ నేతల పేర్లనూ ఆయన మరచిపోతున్నారని, జ్ఞాపకశక్తి పూర్తిగా క్షీణించిందని రిపబ్లికన్ నేతలు ఆరోపిస్తున్నారు.
Here's Video