Arvind Krishna To Lead IBM: ఐబీఎం సీఈఓగా మనోడే, ఐబీఎంని ముందుకు నడిపించనున్న అరవింద్ కృష్ణ, ఐబీఎం నూతన సీఈఓ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
ప్రపంచంలోని ప్రముఖ సంస్థల ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారత సంతతి వ్యక్తులు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ),(Microsoft CEO Satya Nadella) సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ సీఈఓ),(Google and Alphabet CEO Sundar Pichai) అజయ్ బంగా (మాస్టర్ కార్డు సీఈఓ),(MasterCard CEO Ajay Banga) శంతను నారాయణన్ (అడోబ్ సీఈఓ)ల (Adobe CEO Shantanu Narayen) సరసన మరొక భారతీయుడు చేరారు. టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారతీయుడు అరవింద్ కృష్ణ(57)ను(Arvind Krishna) డైరెక్టర్ల బృందం ఎంపిక చేసింది.
New Delhi, January 31: ప్రపంచంలోని ప్రముఖ సంస్థల ఉన్నత స్థానాల్లో వెలుగొందుతున్న భారత సంతతి వ్యక్తులు సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ),(Microsoft CEO Satya Nadella) సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ సీఈఓ),(Google and Alphabet CEO Sundar Pichai) అజయ్ బంగా (మాస్టర్ కార్డు సీఈఓ),(MasterCard CEO Ajay Banga) శంతను నారాయణన్ (అడోబ్ సీఈఓ)ల (Adobe CEO Shantanu Narayen) సరసన మరొక భారతీయుడు చేరారు.
టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా భారతీయుడు అరవింద్ కృష్ణ(57)ను(Arvind Krishna) డైరెక్టర్ల బృందం ఎంపిక చేసింది. వీరితో పాటు ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సికో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి( Indra Nooyi) రిటైర్ అయిన సంగతి తెలిసిందే.
ఐబీఎం (IBM) సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతున్న అరవింద్‌ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓగా ఎన్నుకుంది. ఐబీఎం నవ శకానికి అరవింద్ సరైన నాయకుడని డైరెక్టర్ల బృందం తెలిపింది.
Here's IBM Tweet
ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిఙ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారీలో అరవింద్ బాగా కృషి చేశారని కొనియాడారు. రెడ్ హ్యాట్ కొనుగోలులో అరవింద్ కీలక పాత్ర పోషించారు.
కాగా ఐబీఎం ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ అన్నారు. ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్న గిన్నీ రోమెట్టీ ఈ ఏడాది చివరిలో పదవీ విరమణ చేయనున్నారు. అయితే అరవింద్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పదవీ విరమణ చేసే వరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగుతారు. 1990 అరవింద్ కృష్ణా (57) ఐబీఎంలో చేరారు. కాన్పూర్ ఐఐటీలో సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ, ఇల్లినాయిస్ యూనివర్సీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఆయన పీహెచ్‌డీ చేశారు.
తనను సీఈఓగా ఎన్నుకోవడం పట్ల అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్లు, ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. మెరుగైన సాంకేతిక పరిఙ్ఞానంతో తమ క్లైంట్లకు ఎదురయ్యే కష్టతరమైన సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)