Union Budget 2024: నేడు కేంద్ర బడ్జెట్‌.. 11 గంటలకు లోక్‌ సభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

ఉదయం 11 గంటలకు లోక్‌ సభ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

Budget (Photo Credits: Photo Credits: ANI)

Newdelhi, July 23: 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) పూర్తి స్థాయి బడ్జెట్‌ ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు లోక్‌ సభ (Lok Sabha)లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. దీంతో వరుసగా ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించనున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ మిత్రపక్షాలపై ఆధారపడి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్‌ కు ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఏయే కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు? మధ్యతరగతికి ఆదాయ పన్ను ఉపశమనం ఉంటుందా? జనాకర్షక స్కీమ్‌ లు ఏముంటాయి? అనే అంశాలపై చర్చ నడుస్తున్నది. మొత్తానికి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం బడ్జెట్ సామాన్యుడి ఆశలను చిగురించేలా ఉంటుందా.. కార్పొరేటర్లను సంతృప్తి పరుస్తుందా.. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొన్నది.

భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు

నిర్మల పేరిట ఆ రికార్డు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కు ఇది వరుసగా ఏడో బడ్జెట్‌. తద్వారా ఆరుసార్లు వరుసగా బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ రికార్డును ఆమె అధిగమించనున్నారు. మొత్తంగా ఎక్కువసార్లు బడ్జెట్‌ ను (వరుసగా కాదు) ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్‌ పేరుపై ఉన్నది. ప్రధానులుగా నెహ్రూ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి హయాంలలో ఆయన 10 సార్లు బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు.

భర్తకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ప్రామిస్‌తో ప్రియుడితో శృంగారం, కీలక వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు