Jio Good News: ఎత్తేసిన రెండు ప్లాన్లు మళ్లీ లైవ్‌లోకి, రూ.98, రూ.149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించిన జియో, మా ప్లాన్లే అన్నింటికంటే చౌక అంటున్న రిలయన్స్ జియో
గతంలో ఎత్తేసిన రెండు ప్లాన్ల(Two Plans)ను తిరిగి మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. కాగా ఈ మధ్య మొబైల్ టారిఫ్‌లను జియో పెంచిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన ధరలు మరీ అధికంగా ఉన్నాయన్న విమర్శలను జియో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో... రిలయన్స్ జియో తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించింది.
Mumbai, December 9: టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తన ప్రీపెయిడ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఎత్తేసిన రెండు ప్లాన్ల(Two Plans)ను తిరిగి మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. కాగా ఈ మధ్య మొబైల్ టారిఫ్‌లను జియో పెంచిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన ధరలు మరీ అధికంగా ఉన్నాయన్న విమర్శలను జియో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో... రిలయన్స్ జియో తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించింది.
రూ. 98, రూ. 149 ప్లాన్లను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ మధ్యే పెంచిన మొబైల్ టారిఫ్( Mobile Tariff)లకు అనుగుణంగా నూతన ప్లాన్లను లాంచ్ చేసిన జియో... అంతకు ముందున్న రూ. 98, రూ. 149 ప్లాన్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
ఈ క్రమంలో... రూ. 98 ప్లాన్‌లో 2 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ సౌకర్యాలుంటాయి. ఇక ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. అలాగే రూ. 149 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణయించారు.
సగటు వినియోగదారులకు అవసరమైన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్ పరిమితిని అందిస్తున్నట్టు రిలయన్స్ జియో వెల్లడించింది. కాబట్టి ఈ వినియోగదారులు కాల్స్ కోసం చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదని తెలిపింది. తమ కొత్త ప్లాన్లు పోటీ కంపెనీలకన్నా 25 శాతం అధికంగా కస్టమర్లకు విలువను అందిస్తున్నట్టు పేర్కొంది.
భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితిని తొలగించిన నేపథ్యంలో రిలయన్స్ జియో తాజా ప్రకటన చేసింది. ఈ రెండు కంపెనీలు తమ కొత్త ప్లాన్లను ప్రకటించిన తర్వాత జియో తన ప్లాన్లను వెల్లడించింది.