Mahesh Lost Three Family Members: ఏడాదిలో ముగ్గురిని కోల్పోయిన మహేశ్ బాబు.. ఈ ఏడాది జనవరి 8న సోదరుడు రమేశ్‌బాబు.. సెప్టెంబరు 28న తల్లి ఇందిరాదేవి.. ఆ విషాదం నుంచి తేరుకోకముందే నేడు తండ్రి కృష్ణ మృతి
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు జీవితంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాదిలో ఆయన ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం అందరితో కన్నీళ్లు తెప్పిస్తోంది.
Hyderabad, Nov 15: టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు (Mahesh Babu) జీవితంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాదిలో ఆయన ఏకంగా ముగ్గురు కుటుంబ సభ్యులను (Three Family Members) కోల్పోవడం అందరితో కన్నీళ్లు తెప్పిస్తోంది. జనవరి 8న మహేశ్ బాబు సోదరుడు, నటుడు, నిర్మాత రమేశ్‌బాబు (Ramesh Babu) కాలేయ సంబంధ వ్యాధితో మరణించారు. ఈ బాధ నుంచి ఆయన కోలుకోక ముందే ఆయన తల్లి ఇందిరాదేవి (Indiradevi) సెప్టెంబరు 28న అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.
ఆ విషాదం నుంచి మహేశ్ కోలుకోకముందే ఇప్పుడు ఆయన తండ్రి కృష్ణ (Krishna) కన్నుమూశారు. మహేశ్ జీవితంలో వరుసగా ఎదురవుతున్న ఈ విషాద ఘటనలు పలువురితో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ కష్టకాలం నుంచి ఆయన త్వరగా బయటపడే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్
Kamal Haasan: రాజ్యసభకు తమిళ నటుడు,ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్,.. సీఎం స్టాలిన్ నుండి స్పష్టమైన హామీ, క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పీకే శేఖర్ బాబు!
SSMB 29: సింహాన్ని లాక్ చేశా.. మహేశ్‌తో మూవీపై అదిరే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననన్న మహేశ్ బాబు
Advertisement
Advertisement
Advertisement