Hyd, Jan 25: సూపర్ స్టార్ మహేశ్ బాబు(SSMB29)కి సంబంధించిన అదిరే అప్‌డేట్ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli). ఈ పోస్ట్ లో సింహాన్ని లాక్ చేసిన జక్కన్న.. ఓ పాస్ పోర్ట్ కూడా చుపించారు. దీని అర్ధం పాస్ పోర్ట్ లాక్కొని సింహాన్ని(మహేశ్ బాబు)ని లాక్ చేశా అని.
దీంతో ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా మొదలైనట్లేనని హింట్ ఇచ్చారు. వాస్తవానికి మహేష్ బాబు(Mahesh Babu) సినిమా సినిమాకు గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తారన్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళితో సినిమా అంటే వెరే సినిమాలే కాదు వెకేషన్‌కు వెళ్లడం కుదరదు. నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత నాలుగు రోజులుగా కొనసాగిన దాడులు
ఇదే అర్థం వచ్చేలా జక్కన్న పోస్టు పెట్టగా దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లే ఇచ్చారు. పోకిరి సినిమాలోని డైలాగ్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని కామెంట్ చేశారు. నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) కూడా ఫైనల్లీ అని రిప్లే ఇచ్చారు. ఇందుకు సంబంధించి జక్కన్న చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mahesh Babu's Passport Seize ... Rajamouli gives SSMB 29 movie update
View this post on Instagram
మహేశ్ కోసం ఎనిమిది విభిన్న లుక్స్‌ను రెడీ చేయగా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ కథలో విదేశీ నటులు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక ఈ చిత్రానికి 'గరుడ' అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.