Tamannaah Bhatia: రాత్రిపూట తినడం మానేశా, అందుకే నా చర్మకాంతి మెరుగైంది, గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తున్నానని తెలిపిన తమన్నా, కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా త్వరలో ఎంట్రీ
కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వటానికి కథానాయిక తమన్నా (Tamannaah Bhatia) సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తన అందం, ఆరోగ్యానికి కారణమైన ఆహారపు అలవాట్లను గురించి సోషల్ మీడియాలో నటి (Actress Tamannaah Bhatia) కొన్ని విషయాలను పంచుకున్నారు.
కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వటానికి కథానాయిక తమన్నా (Tamannaah Bhatia) సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తన అందం, ఆరోగ్యానికి కారణమైన ఆహారపు అలవాట్లను గురించి సోషల్ మీడియాలో నటి (Actress Tamannaah Bhatia) కొన్ని విషయాలను పంచుకున్నారు. మేని ఛాయకు, అలసట దరి చేరకుండా ఉండడానికి తను ఆహారం తీసుకునే విధానమే కారణం అని చెప్పారు.
రాత్రి భోజనం మానేయడం చాలా కష్టంగా అనిపించింది. దాంతో రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు భోజనం చేసి, మళ్లీ తెల్లవారి ఉదయం ఆరు గంటలకు టిఫిన్ చేసేదాన్ని. 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం వల్ల నా చర్మకాంతి మెరుగైంది. చక్కగా నిద్రపట్టేది. గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తున్నాను’’ అని తమన్నా చెప్పారు.
అదేవిధంగా ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ముఖ సౌందర్యం గురించి తెలిపింది. మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటి అని ప్రశ్న వేయగా, తమన్నా క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఉదయాన్నే లేచిన వెంటనే తన లాలాజాలం (సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పి షాకిచ్చింది. సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని కూడా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తమన్నా.. అనిల్ రావిపూడి ఫన్ రైడ్ F3తో పాటు ''గుర్తుందా శీతాకాలం, మాస్ట్రో, సీటీమార్'' సినిమాల్లో నటిస్తోంది. లాక్ డౌన్ తర్వాత తిరిగి షూటింగ్స్ ఓపెన్ కావడంతో మిల్కీ బ్యూటీ ఫుల్ బిజీ అయింది .