Adipurush OTT Release: ఆదిపురుష్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్పుడే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు ఇక, రూ.150 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్

రీసెంట్ గా ఇది చెప్పారు గానీ బిగ్ స్క్రీన్ పై బొమ్మపడిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయిపోయింది

Adipurush (Credits: Twitter)

రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ప్రతిఒక్కరూ రాముని భక్తిలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్నిచోట్ల తొలిరోజు షోలన్నీ దాదాపు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇదే టైంలో 'ఆదిపురుష్' ఓటీటీ డీటైల్స్ కూడా బయటకొచ్చేశాయి.

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'ఆదిపురుష్' ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. రీసెంట్ గా ఇది చెప్పారు గానీ బిగ్ స్క్రీన్ పై బొమ్మపడిన తర్వాత ఇది కన్ఫర్మ్ అయిపోయింది. అన్ని భాషలకు కలిపి రూ.150 కోట్లకు డీల్ కుదిరినట్లు టాక్ నడుస్తోంది. దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందని అంటున్నారు.

వీడియో ఇదిగో, థియేటర్లో ఆదిపురుష్ మూవీని చూస్తున్న కోతి, హనుమంతుడు రాగానే ఎగిరి గంతులు, సోషల్ మీడియాలో వైరల్

ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రభాస్ తోపాటు సైఫ్ అలీఖాన్, కృతిసనన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. గతేడాది టీజర్ రిలీజ్ టైంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా.. రిలీజ్ కి ముందు కాస్త హైప్ క్రియేట్ చేసుకుంది.