Allu Arjun Released: చట్టానికి కట్టుబడి ఉంటా.. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్.. తండ్రిని చూడగానే పరిగెత్తుకొచ్చిన అయాన్ (వీడియోలతో)

చట్టానికి తాను కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.

Allu Arjun (Credits: X)

Hyderabad, Dec 14: శుక్రవారం అరెస్టై నిన్న రాత్రంతా చంచల్‌ గూడ జైలులో (Chanchalguda Jail) గడిపిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) శనివారం ఉదయం 6.35 గంటల ప్రాంతంలో ఎట్టకేలకు విడుదల అయ్యారు. భారీ ఎస్కార్ట్ మధ్య జైలు వెనుక గేటు నుంచి బన్నీని అధికారులు పంపించారు. జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అటు నుంచి జూబ్లి హిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ చేరుకున్నారు. తండ్రిని చూడగానే అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి అల్లు అర్జున్ ని హత్తుకున్నారు. అనంతరం భార్య స్నేహ, కూతురు అర్హ ఆయన్ని కలిశారు. ఆ తర్వాత అల్లు అర్జున్  మీడియాతో మాట్లాడారు. చట్టానికి తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు.

దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వ‌ర్మ నాలుగు ప్ర‌శ్నలు 

జైలులో ఇలా..

అయితే, హైకోర్టు ఉత్తర్వులు అందడంలో జాప్యం, బెయిల్ కాపీ హార్డ్ కాపీ కోసం అధికారులు అడగడంతో నిన్న బన్నీ విడుదల ఆలస్యమైంది. దీంతో రాత్రంతా చంచల్‌ గూడ జైలులోని మంజీరా బ్లాక్‌ లోనే బన్నీ గడిపారు.  జైలు గదిలో బన్నీని ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్‌ లో ఉంచారు. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్టు సమాచారం. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా అర్జున్ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి అధికారులు ఇచ్చినట్టు తెలుస్తుంది.

అసలేమైంది??

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Vallabhaneni Vamsi Mohan Case: నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ హాని ఉందని తెలిపిన వల్లభనేని వంశీ, 14 రోజుల రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

Hyderabad: బాలుడు అరుస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఫోక్సో కోర్టు

Advertisement
Advertisement
Share Now
Advertisement