Representative Image (Photo Credit: PTI)

Hyd, Feb 14: హైదరాబాద్ నగరంలోని మోహిదిపట్నం పరిధిలో ఓ మైనర్ బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతో ( 20 years in jail) పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. హుమాయున్ న‌గర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్ట‌ర్‌ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీలో నివసించే మసూద్(43) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు.

అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి, ప్రేమోన్మాది తనకు దక్కలేదనే కోపంతో కక్షకట్టి మరీ..

ఇతను 2018 ఏప్రిల్ 25వ తేదీన మెహిదీపట్నం ఫిల్టర్ బెడ్స్ ప్రాంతంలో నివసించే ఓ బాలుడిని ఆటోలో బలవంతంగా ఎత్తుకెళ్లి దారుణమైన పద్దతిలో అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు నొప్పితో అరుస్తున్నా నోరు కప్పెట్టి తన కామవాంఛను తీర్చుకున్నాడు. అనంతరం ఈ ఘ‌ట‌న‌పై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హుమాయున్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా గురువారం ఈ కేసులో పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ 12వ కోర్టు జడ్జి అనిత నిందితుడిని దోషిగా గుర్తించి (Man convicted of raping minor boy) 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.