Hema Suspended from MAA: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెండ్, కేసులో క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్

పోలీసుల నివేదికలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్‌ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది.

Telugu Actress Hema Arrested By CCB in Connection With Bengaluru Rave Party Case

బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bengaluru Rave Party)లో అరెస్టైన ప్రముఖ సినీ నటి హేమ (hema)ను సస్పెండ్‌ చేస్తూ మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసుల నివేదికలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్దారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. హేమ సస్పెన్షన్‌ విషయమై మా కమిటీ బుధవారం సుదీర్ఘంగా చర్చించింది. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తెలుగు నటి హేమ అరెస్ట్, సీసీబీ పోలీసులు ఎదుట హాజరైన వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

హేమను సస్పెండ్ చేస్తున్నట్టు ఇవాళ మంచు విష్ణు ప్రకటించారు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో మంచు విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని మా సభ్యులకు తెలిపారు. ఈ కేసులో హేమను కోర్టులో హాజరుపరచగా.. జూన్ 14 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టైన హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదని తెలిసిందే. మూడోసారి నోటీసులు జారీ చేసి.. విచారణ అనంతరం అరెస్ట్ చేశారు.