బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ సీసీబీ పోలీసులు ఎదుట సోమవారం హాజరైంది. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలంటూ హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు పంపించగా వివిధ కారణాలు చెప్పి డుమ్మా కొట్టింది. సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే ఈమెని అరెస్ట్ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచనున్నారు.
గత నెల 20న బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే! మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉంది. అయితే మొదట ఆ రేవ్ పార్టీకి, తనకు సంబంధం లేదని బుకాయించింది. కానీ తనకు జరిపిన రక్త పరీక్షల్లో ఆమె డ్రగ్స్ తీసుకుందని రుజువైంది. బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు, ఇద్దరు తెలుగు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ
బెంగళూరు నగరశివారులోని హెబ్బగోడిలో మే 19 రాత్రి నుంచి మే 20 తెల్లవారు జాము వరకు రేవ్ పార్టీ జరిగింది. వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పేరు చెప్పి 'సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ' పేరిట పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. పార్టీకి ప్రధాన కారకులైన నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధిఖి, వాసు, అరుణ్‌కుమార్, నాగబాబును పోలీసులు ఇదివరకే అరెస్టు చేశారు.