Bengaluru Rave Party (Photo Credit: X/@sudhakarudumula)

Hyd, May 23: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు. మే 20న ఇక్కడి ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి హాజరైన ఇద్దరు ప్రముఖ తెలుగు నటీనటుల రక్త నమూనాలు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి.

బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని సింగెన అగ్రహారలోని జీఎం ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ సేవించినట్లు నివేదికలు నిర్ధారించాయి. 50 మందికి పైగా పురుషులు మరియు దాదాపు 30 మంది మహిళలు డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. వీరికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు సీసీబీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులు సిద్ధమవుతున్నారు.  వీడియో ఇదిగో, బెంగుళూరు రేవ్ పార్టీలో నేను లేను, అతను నాలాగే ఉన్నాడు, చూసి షాకయ్యానని తెలిపిన హీరో శ్రీకాంత్

నగర శివారులో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. వారంతా మత్తు పదార్థాలు తీసుకున్నారో.. లేదో పరీక్షించడానికి రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. ఈక్రమంలో తాజాగా డ్రగ్స్‌ పరీక్షల వివరాలు వెల్లడించారు.

టాలీవుడ్ నటి హేమకు పాజిటివ్ అని తేల్చిన పోలీసులు.. పాజిటివ్ జాబితాలో హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు. త్వరలోనే వీరందరికీ నోటీసులు పంపనున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. కృష్ణవేణి పేరుతో టాలీవుడ్ నటి హేమ పార్టీకి హాజరైనట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసు రికార్డుల్లో హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేశారు. ఇక రేవ్ పార్టీకి అస్సలు పోలేదని హేమ వీడియో విడుదల చేసిన తర్వాత పోలీసులు ఫొటోలు రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయింది. ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో, మరుసటి రోజు ఆవకాయ చేస్తూ వీడియో విడుదల చేసింది. చివరకు డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్ గా తేలడంతో ఖంగుతింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ తెలుగు హీరోలు, సుమారు 15 విలువైన కార్లను సీజ్‌, వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూర్‌ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్‌ పార్టీ జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్‌ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్‌ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు.

మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్‌ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు. ఈ పార్టీ మాటున సెక్స్‌ రాకెట్‌ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్‌ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు.

ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు.