Bholaa Shankar Twitter Review: భోళా శంకర్ రివ్యూ ఇదిగో, ట్విట్టర్లో సినిమాపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, మరి వారేమంటున్నారో ట్వీట్లలో చూసేయండి
తమిళ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు.
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ చిరంజీవి మాస్ మూవీ చేస్తుండడంతో ‘భోళా శంకర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి.ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది.దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ట్విటర్‌లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఈ చిత్రం బాగుందని ట్వీట్ చేస్తే.. మరికొంతమంది యావరేజ్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. సెకండాఫ్‌లో బాస్ తెలంగాణ యాసలో ఇంకా సూపర్. ఖుషీ సీన్‌లో మెగాస్టార్ ఇరగ్గోట్టేశాడు. సెంటిమెంట్‌తో కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఫస్టాఫ్‌లో సాంగ్స్, కామెడీ వర్కౌట్ అయింది. కానీ కొన్ని రొటీన్ ఓల్డ్ సీన్స్ ఆకట్టుకోలేదు. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు వేదాళంలో ఉన్నట్లే ఉంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొంత మంది అయితే రీమేక్ అసలు వర్కవుట్ అవలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Here's Twitter Review:
ఎలాంటి హైప్ లేకుండా వెళ్తే డీసెంట్ హిట్ అనిపిస్తుంది.. బాస్ లుక్స్.. బీజీఎం గురించి అయితే అడక్కండి.. దారుణంగా ఉంది.. ఖుషీ సీన్ బాగుంది.. ఓవరాల్ బ్లాక్ బస్టర్ భోళా అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.చిరు కామెడీ టైమింగ్, కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్.. తమన్నా పర్పామెన్స్.. డ్యాన్స్.. సినిమాను చూసేలా చేస్తాయి.. మహతి పాటలు అద్భుతంగా ఉన్నాయి.. ఓవరాల్ డీసెంట్ హిట్.. బాస్ తన కామెడీ టైమింగ్‌లో ఎప్పుడూ బెస్టే.. మెహర్ అద్భుతంగా తీశాడు.. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. సినిమా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుందిని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
Here's Twitter Review:
చిరు లుక్స్, కీర్తి సురేష్ అద్భుతంగా ఉన్నారు.. కానీ మిగతా వారు వేస్ట్ అన్నట్టుగా ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. సినిమా రొటీన్ అని, సెకండాఫ్ సినిమాను నిలబెడుతుందని కొందరు అంటున్నారు.మొత్తానికి నెగెటివ్ కామెంట్లు కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. కానీ మెజార్టీ మాత్రం సినిమా ఒక్కసారి చూడొచ్చు అని సలహాలు ఇస్తున్నారు.
భోళా శంకర్ సినిమా చూసిన తర్వాత అవుట్ డేటేడ్ డైరెక్షన్. .జీరో హై మూమెంట్స్, సాంగ్స్ ప్లేస్‌మెంట్ బాగాలేవు. కామెడీ సీన్లు అంతగా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ బాగాలేదు. 2010లో తీసినట్టుగా స్క్రీన్ ప్లే ఉంటుంది. సెకండాఫ్ వర్కవుట్ అయితే సినిమా హిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Here's Twitter Review:
భోళా శంకర్ కమర్షియల్ మూవీ. కొన్ని కామెడీ సీన్లు, యాక్షన్ బ్లాక్‌లు బాగున్నాయి. మిగితా విషయాలకు వస్తే పెద్దగా వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ పేలవంగా ఉంది. సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది. పవర్‌తో కూడిన పంచ్ మిస్ అయిందనే ఫీలింగ్ ఉంటుంది. అవుట్ డేటేడ్ స్క్రిప్టు, స్టోరి నేరేషన్. సినిమా యావరేజ్‌గా ఉంది అని నెటిజన్ కామెంట్స్ చేశారు.