Chalapathi Rao: రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరం.. చలపతి రావు మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి

సీనియర్ సినీ నటుడు చలపతిరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు.

Chalapathi Rao Credits: Twitter

Hyderabad, Dec 25: సీనియర్ సినీ నటుడు చలపతిరావు (Senior Actor Chalapathi Rao) ఈ తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు (TDP President Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్ (Janasena President Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు.

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు. చలపతిరావు మృతి సినీ పరిశ్రమకు (Movie Industry) తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ప్రముఖ నటులు చలపతిరావు కన్నుమూయడం బాధాకరమని చెప్పారు.

రాజీవ్ స్వగృహ టవర్లను అమ్మేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. నోటిఫికేషన్ విడుదల

ప్రతి నాయకుడి పాత్రల్లోనే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన శైలిలో సినీ అభిమానులను మెప్పించారని తెలిపారు. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించారని కొనియాడారు. ఒక తరానికి సినీ పరిశ్రమ ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేస్తుండటం దురదృష్టకరమని చెప్పారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement