
Hyderabad, Dec 25: రాజీవ్ స్వగృహ ప్లాట్లను (Rajiv Swagruha Plots) గతంలో విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈసారి ఏకంగా టవర్లనే (Towers) అమ్మకానికి పెట్టింది. హైదరాబాద్‌లోని (Hyderabad) పోచారం (Pocharam), గాజులరామారంలో (Gajularamaram) పనులు పూర్తికాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పోచారంలో నాలుగు, గాజుల రామారంలో 5 టవర్లను విక్రయించనున్నట్టు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి.. కేంద్రం ప్రకటన
పోచారంలో ఒక్కో టవర్‌లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా, గాజుల రామారంలో ఒక్కో టవర్‌లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థలు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది. ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30ని చివరి తేదీగా పేర్కొంది. టవర్ల వివరాలు, పూర్తి సమాచారం కోసం www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in ను సంప్రదించవచ్చు.
ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉన్నాం.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి