Hyderabad, Dec 25: చైనాలో (China) కరోనా (Corona) విలయ తాండవం చేస్తోంది. ఈ దేశంతో పాటు పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. కేసులు (Cases) ఎక్కువగా నమోదవుతున్న ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు (RT-PCR Tests) నిర్వహించాలని ఆదేశించింది. ఈ జాబితాలో చైనా, జపాన్, దక్షిణకొరియా, థాయ్ లాండ్, సింగపూర్ దేశాలు ఉన్నాయి.
ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉన్నాం.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
వీరికి ఎయిర్ పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. థర్మల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినా, జ్వరం ఉన్నా వారిని క్వారంటైన్ లో ఉంచుతారు. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వారి ఆరోగ్య పరిస్థితిని తెలయజేసేందుకు ఎయిర్ సువిధ ఫామ్ ను కచ్చితంగా నింపాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
दिल्ली इंटरनेशनल एयरपोर्ट पर आज चीन, हांगकांग, बैंकॉक, जापान, साउथ कोरिया सहित विदेश से आने वाले यात्रियों का कोरोना का सैम्पल टेस्ट चालू कर दिया गया है।
कोरोना के बढ़ते प्रभाव को देखते हुए सभी आवश्यक कदम उठाए जा रहे हैं। pic.twitter.com/J4ZERQAuWU
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 24, 2022