
Hyderabad, Dec 25: ప్రపంచదేశాలను కరోనా (Corona) మరోసారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఫోర్త్ వేవ్ (Fourth wave) పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ (Telangana Health Director) శ్రీనివాసరావు చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ అన్ని జాగ్రత్తలను తీసుకుంటోందని తెలిపారు. కొవిడ్ టెస్టులను (Covid Tests) పెంచామని తెలిపారు.
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
ఇప్పటికే రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్ (Vaccination) పూర్తయిందని చెప్పారు. మరోసారి కరోనా ప్రభావం పెరిగే అవకాశం లేదని... అయినప్పటికీ అందరూ పూర్తి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గుంపులుగా ఉన్నప్పుడు మాస్క్ ధరించాలని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.