Hyderabad, Dec 25: ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్‌మస్. క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చ్ లను అందంగా అలంకరిస్తారు. వెదురు బద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడ దీస్తారు. తమ ఇంట్లో క్రిస్‌మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగు రంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. పల్లెటూళ్లలో పండుగ నెల రోజుల్లో ఉందనగా ఇంటిని ముస్తాబు చేసుకోవడం మొదలు పెడతారు. అరిసెలు మొదలగు పిండివంటలకు సన్నాహాలు చేస్తారు. మరోవైపు యువత, 'క్రీస్తు జయంతి' నాటికను ప్రాక్టీస్ చేయడం, వెదురు కర్రలతో 'స్టార్' తయారు చేయడం లాంటి పనుల్లో మునిగిపోతారు. క్రిస్‌మస్ తాత వేషధారణతో బహుమతులు, గ్రీటింగ్‌కార్డులు ఇచ్చుకుంటూ ఆనందం వ్యక్తపరుచుకుంటారు. గతంలో కొందరు తమ పేర్లు, ఫొటోను కూడా ముద్రించి మరీ గ్రీటింగ్ కార్డులు 'ప్రింట్' చేయించి బంధుమిత్రులకు పంపేవారు. క్రమంగా 'క్రిస్మస్' గ్రీటింగ్స్ ప్రాధాన్యం 'న్యూ ఇయర్'కు బదిలీ అయింది. దాంతో సమాజంలోని అందరూ 'న్యూ ఇయర్' గ్రీటింగ్స్ పంపుకోవడం సర్వసాధారణమైంది. మానవ సంబంధాలను బలోపేతం చేసే ఎవరి పండగ అయినా- అందరికీ పండగే, సందడే! విష్ యూ హ్యాపీ క్రిస్మస్.. ఈ సందర్భంగా మీ స్నేహితులకు, బంధువులకు ఈ హెచ్ డీ ఇమేజెస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)